ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో మరోసారి కలహాలు రేగాయా.. అవి ముదిరి పాకాన పడ్డాయా.. కొన్నాళ్లుగా కడప జిల్లాలో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సోద‌రుడు, జ‌గన్‌ చిన్నాన్న వైఎస్‌ మనోహర్‌రెడ్డి జగన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. 

Image result for ys jagan family photos

జగన్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న మ‌నోహ‌ర్‌రెడ్డిని బుజ్జ‌గించేందుకు వైఎస్ ఫ్యామిలీ చాలా ప్రయత్నాలు చేసినట్టు కూడా తెలుస్తోంది. విషయం ఏంటంటే.. మ‌నోహర్‌రెడ్డి భార్య ప్రమీల ప్రస్తుతం పులివెందుల మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్నారు. మనోహర్‌రెడ్డి కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు. మునిసిపాలిటీ వ్యవహారాల్లో జగన్ ఫ్యామిలీ జోక్యం ఎక్కువైందని ఆయన కోపంగా ఉన్నారట. 

Image result for pulivendula municipality
అంతే కాదు.. మ‌నోహ‌ర్‌రెడ్డి , ఆయ‌న భార్య త‌మ పదవులకు కూడా రాజీనామా చేస్తారన్న ప్రచారాలు వినిపించాయి. వైఎస్‌.వివేకానందరెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేస్తోన్న టైంలో వాళ్ల ఫ్యామిలీలో విబేధాలు రావ‌డం వైకాపాలో కలకలం రేపాయి. దీంతో జగన్ చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఆ లాబీయింగ్ ఫలించింది. వైఎస్‌ కుటుంబంలో మేమందరం కలిసి కట్టుగా ఒకటిగానే ఉంటున్నామని తాజాగా పులివెందుల మున్సిపల్‌ కౌన్సిలర్‌ వైఎస్‌ మనోహర్‌రెడ్డి మీడియా ముందు చెప్పేశారు. 



వైసీపీ కార్యాలయంలో ఆయన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డితో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. 1995 నుంచి తమ చిన్నాన్న రాజారెడ్డి పంచాయతీ వ్యవహారాలు కూడా తనకే అప్పగించారని మనోహర్ రెడ్డి తెలిపారు. పులివెందుల పంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలో 25 సంవత్సరాలుగా నాకే అధికారం కట్టబెట్టారని వివరించారు. కొన్ని పత్రికల్లో పార్టీని వీడుతున్నట్లు రావడం బాధాకరమన్నారు. వైసీపీని వీడే ప్రసక్తేలేదన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: