వీరప్పన్.. స్వంతంత్ర్య భారతంలో ప్రభుత్వాలను ఇంతగా గడగడలాడించిన స్మగ్లర్ లేడేమో.. కొన్ని వందల మంది పోలీసులను పొట్టనపెట్టుకున్న నరరూప రాక్షసుడు.. మరి 
అలాంటి అడవి దొంగ పోలీసులకు సులభంగా ఎలా చిక్కాడు.. అందుకు దారి తీసిన పరిస్థితులేంటి.. ఈ అంశాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి..

Image result for veerappan
అతడిని మట్టుపెట్టిననాటి తన అనుభవాలపై మాజీ ఐపీఎస్‌ అధికారి విజయకుమార్‌ ఒక పుస్తకాన్ని రాశారు. అందులో ఈ సీక్రెట్ అన్నీ చెప్పేశారట. వీరప్పన్ ను చంపడంలో చెన్నైకి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రముఖ పాత్ర పోషించారట. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తకు వీరప్పన్ తో ఎంతోకాలంగా సన్నిహిత పరిచయముందట.

Image result for veerappan
ఆ పారిశ్రామిక వేత్తపై పోలీసులు నిఘాపెట్టడంతో వీరప్పన్ గుట్టు రట్టయింది. వీరప్పన్ మారణాయుధాల కోసం, కంటి ఆపరేషన్ కోసం ఆయన్ను ఆశ్రయించాడట. చెన్నైలో పేరుమోసిన రౌడీ ఆయోధ్యకుప్పం వీరమణిని ఎన్ కౌంటర్‌ చేసిన ఎస్‌ఐ వెల్లదురైని.. వీరప్పన్  వద్దకు మారువేషంలో పంపాలని విజయకుమార్‌ ప్లాన్ చేశారట. పారిశ్రామికవేత్త ఇచ్చిన సమాచారం మేరకు వీరప్పన్ తన గూఢచారిని పంపాడు. ఆ విషయం గుర్తించిన పోలీసులు వీరప్పన్ ను ప్లాన్ ప్రకారం చుట్టుముట్టు మట్టుబెట్టారట.



మరింత సమాచారం తెలుసుకోండి: