వైసీపీ ఎమ్మెల్యే రోజాపై పగబట్టిన టీడీపీ ఇప్పటికే ఓ ఏడాది పాటు ఆమెను అసెంబ్లీ నుంచి వెలేసింది.. ఇప్పుడు ఆ గడువు పూర్తయింది. ఇప్పుడు ఇక ఆమె అసెంబ్లీకి రావచ్చు. ఇంతలో అసెంబ్లీ ఆంధ్రా సొంత గడ్డ అమరావతికి మారింది. తొలి అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ దుమ్ముదులిపేందుకు రోజా రెడీ అయిపోయింది. 


అందులోనూ మొన్నటి మహిళాపార్లమెంటుకు రానీయకుండా టీడీపీ ఆమెను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. సదస్సుకు ఆహ్వానించి మరీ గన్నవరం ఎయిర్ పోర్టులోనే అరెస్టు చేసి ఎక్కడెక్కడో తిప్పారు. చివరకు హైదరాబాద్ తీసుకొచ్చేశారు. అందుకే ఇప్పుడు ఆ విషయాలన్నీ కొత్త అసెంబ్లీ సాక్షిగా కడిగేసేందుకు రోజా రెడీగా ఉంది. కానీ టీడీపీ రాజకీయం మాత్రం మరోలా ఉంది. 


ఇప్పటికే రోజాను ఏడాది పాటు అసెంబ్లీకి దూరం చేసిన టీడీపీ.. ఇప్పుడు మరో ఏడాది పాటు దూరం పెట్టాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకు పాయకరావు పేట ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదును అడ్డం పెట్టుకుని మరో ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం చేసిందట. రోజాపై మరో ఏడాది పాటు వేటు వేస్తారన్న న్యూస్ అన్ని మీడియాల్లోనూ ప్రముఖంగా వచ్చేసింది. 


ఐతే.. ఈనాడు పత్రికలో మాత్రం ఈ వార్త కాస్త వెరయిటీగా వచ్చింది. అనిత ఫిర్యాదుపై రోజా ఇప్పటికే లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పింది. కానీ దీంతో అనిత శాటిస్ ఫై కావడం లేదు. తనకు పర్సనల్ గా సారీ చెప్పాలంటోంది. అందుకే తాను అసెంబ్లీకి హాజరై క్షమాపణ చెబుతానని రోజా క్రమశిక్షణ కమిటీకి చెప్పిందట. ఈ న్యూస్ ఒక్క ఈనాడులోనే రావడం విశేషం.


ఒకేవేళ రోజా అమరావతి అసెంబ్లీకి హాజరై సభాముఖంగా సారీ చెప్పేస్తే.. మాత్రం క్షమించి వదిలేయాలని టీడీపీ పెద్దలు నిర్ణయించారని ఈనాడు రాసింది. కానీ వాస్తవానికి రోజా సారీ చెపుతుందా.. సాధారణంగా రోజా సారీ చెప్పే అవకాశమే లేదు. ఆ మేరు ఆమె మీడియాలోనూ ఎక్కడ చెప్పలేదు. నిజంగా సారీ చెప్పేందుకు రెడీ అయితే మాత్రం అది పెద్ద విశేషంగానే చెప్పుకోవాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: