మోదీ టూర్‌: శ్రీనగర్‌లో గ్రనేడ్‌ దాడి!


జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో పాత శ్రీనగర్‌ నౌహట్టా ప్రాంతంలో ఆదివారం గ్రనేడ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ పోలీసు మృతి చెందగా, 11 మంది పోలీసులకు గాయాలయ్యాయి. నౌహట్టా ప్రాంతంలోని గంజ్‌బక్ష పార్కు సమీపంలో పహరా కాస్తున్న పోలీసులు లక్ష్యంగా 
తీవ్రవాదులు గ్రనేడ్‌ దాడి చేశారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన పోలీసులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.


జగన్నాధాలయంలో దివ్యాంగురాలిపై అత్యాచారం


ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాథ ఆలయంలో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. శుక్రవారం నాడు రాత్రిపూట గుడిలో 11 ఏళ్ళ మైనర్ దివ్యాంగురాలిపై అత్యాచారం చేశారు. రాత్రిపూట గుడిని మూసివేసే సమయంలో దేవుడి దర్శనం కోసం దివ్యాంగురాలు గుడికి వచ్చింది. అయితే గుడిలో ఆ సమయంలో ఉన్న 28 ఏళ్ళ యువకుడు సహయం చేస్తానని నమ్మించి ఆ యువతిని స్నానాల గదికి తీసుకెళ్ళాడు.


నాకు ఓటేస్తే...కావాల్సినంత బీఫ్..!

బీఫ్‌పై నిషేధం అంశం ఇప్పుడు ఎన్నికల్లోనూ ప్రచారాస్త్రం అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల బీఫ్‌పై నిషేధం విధించగా నాగాలాండ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే బీఫ్‌పై ఎలాంటి నిషేధం ఉండదని ఆ పార్టీ చీఫ్ ఈమధ్యే ప్రకటించారు. తాజాగా కేరళ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఒకరు 'నాకు ఓటు వేస్తే...మంచి బీఫ్‌కు పూచీ నాది' అంటూ ప్రకటించారు. గోమాంసం అమ్మకాలు, వినియోగంపై ఎలాంటి ఆంక్షలు లేని రాష్ట్రాల్లో కేరళ కూడా ఉంది. కాగా, అక్కడి మలప్పురం లోక్‌సభకు తాజాగా ఉపఎన్నిక జరగబోతోంది.


దర్గాలో అరాచకం.. 20మంది మృతి!

పాకిస్థాన్‌లోని ప్రఖ్యాత సూఫీ దర్గాలో అమానుష హింసాకాండ చోటుచేసుకుంది. మతిస్థిమితంలేని, సైకో దర్గా పెద్ద కత్తులతో విరుచుకుపడి 20మంది భక్తులను 
పొట్టనబెట్టుకున్నాడు. మృతుల్లో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. నలుగురు మహిళలు ఉన్నారు. ఈ అరాచక ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు.పాకిస్థాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని మహహ్మద్‌ లీ గుజ్జర్‌ సూఫీ దర్గాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.


ఒలింపిక్ చాంపియన్‌పై సింధు విజయనాదం..

india open super series title

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు తన కలను నెరవేర్చుకుంది. స్వదేశంలో తొలి సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌ను సాధించింది. ఇండియా ఓపెన్‌ 
టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్‌ కరోలినా మారిన్‌(స్పెయిన్) పై 21-19, 21-16 తేడాతో సింధు(భారత్) నెగ్గింది. దీంతో గతేడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లో ఓటమికి సింధు ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఇండియా ఓపెన్‌ టోర్నమెంట్‌ ఆరో ప్రయత్నంలో హైదరాబాద్‌ అమ్మాయి సింధు టైటిల్‌ కలను నిజం చేసుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: