సాధారణంగా అనేక సందర్బాల్లో ఒకరి సేవ ద్వారా మనం పొందిన సంతృప్తికి సంతోషంగా దానికి కారణమైన వారికిచ్చేదే "టిప్స్ (TIPS-To Insure Promptness) రూపములో బహుమానం ఇవ్వటం జరుగుతుంది. దీనికి మరో రూపమే "సర్వీస్-చార్జ్" కాకపోతే మన వ్యవస్థలో ఉన్న లోపాలతో బిల్లులోనే 10% గంపగుత్తగా వినియోగ దారుని ఇష్టా-ఇష్టాలో సంబందం లేకుండా బిల్లులో చేర్చి వినియోగదారులను దోచేసే అవస్థ ఈ వ్యవస్థ లో చోటుచేసుకుంది.
హోటల్ బిల్లును ఎప్పుడు ఏకమొత్తంగా చూడ్డమే మనకు అలవాటు. బిల్లులో తిన్న పదా లకు ఒక్కొదానికి విడి విడిగా ధర ఉంటుంది. దీంతోపాటు సర్వీస్-ఛార్జ్ అనే లైన్ కూడా ఉంటుంది. మొత్తం బిల్లులో 10 శాతాన్ని హోటళ్లు సర్వీస్ ఛార్జ్ కింద వసూలు చేస్తాయి.
హోటల్‌కు వెళ్లినప్పుడు మొత్తం రూ. 5500/- బిల్లు అయితే, రూ. 5000/- వందలు మనం తిన్న ఆహార పదార్దాల ధరకు సరిపోతుం ది. మిగిలిన రూ. 500/- వందలు సర్వీస్ ఛార్జ్ కింద లెక్క. అది సర్వీస్ బాగుంటేనే అదీ మనకు ఇష్టమైతేన ఇస్తాం. లేకపోతే ఇవ్వనసరం లేదు.
ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా విజయ్ గోపాల్ అనే వ్యక్తి వెలికి తీశాడు. చాలా మందికి "సర్వీస్-ఛార్జ్" గురించి తెలియని విషయం విజయ్ గోపాల్ అనే వ్యక్తి ఓపిగ్గా చేసిన ప్రయత్నంతో వెలుగులోకి వచ్చింది. సుమారు రూ. 5వేలు బిల్లు అయితే సర్వీస్-ఛార్జ్‌తో కలిపి రూ. 5500 వసూలుచేస్తారు. ఒకేవేళ ఆహోటల్లో సర్వీస్ నచ్చక పోతే సర్వీస్-ఛార్జ్ చెల్లించ నవసరం లేదు. విజయ్ గోపాల్ అనే వ్యక్తి ఒక హోటల్ పై చేసిన పోరాటం వల్ల సర్వీస్-ఛార్జ్ తప్పనిసరి కాదనే విషయం తేలిపోయింది.
హైదరాబాద్ శిల్పకళావేదిక వద్ద ఉన్న ఒక హోటల్‌కు వెళ్లిన విజయ్ గోపాల్‌కు రూ. 213 సర్వీస్ ఛార్జ్ వేశారు. ఆ హోటల్లో సర్వీస్ నచ్చని ఆయన సర్వీస్-ఛార్జ్ కట్టేది లేదని అన్నారు. కానీ సిబ్బంది చట్ట ప్రకారం సర్వీస్-ఛార్జ్ చెల్లించాలని అనడంతో మొత్తం బిల్లు కట్టి ఆయన బయటకు వచ్చారు.
అంతటితో మర్చిపోకుండా ఈ సర్వీస్ ఛార్జ్ సంగతేమిటో తెలుసుకోవాలని అనుకున్నారు. "సమాచార హక్కు చట్టం" కింద హోటళ్లలో సర్వీస్-ఛార్జ్ విధి విధానాలను తెలుసుకున్నారు. ఆ సమాచారం ప్రకారం, హోటళ్లలో సర్వీస్ నచ్చినప్పుడు వినియోగదారుడు ఇచ్చేదే సర్వీస్ ఛార్జ్ అని, నచ్చకపోతే సర్వీస్ ఛార్జ్ కట్టాల్సిన పనిలేదని ఉంది.
దీంతో ఆయన వినియోగదారుల పిర్యాదీ కేంద్రం ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన "కన్జూమర్ ఫోరమ్" విజయ్ గోపాల్ వాదనను బలపరిచింది. ఆయన వద్ద నుంచి వసూలు చేసిన సర్వీస్-ఛార్జ్ సొమ్మును తిరిగి చెల్లించాల్సిందిగా హోటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. పరిహారం కింద మరో రూ.5000/- చెల్లించాలని చెప్పింది.
Helping fight corruption