అణుయుద్ధం దాని పరిణామాలు జపాన్ జనవాహినికి తెలిసినంతగా మరేదేశ ప్రజలకు తెలియదు. ఇప్పటికీ అణుదాడికి గురైన హిరోషిమా, నాగసాకి ప్రాంతాల్లో గడ్డికూడా మొలవదని అంటారు. అందుకే ఇప్పుడు జపాన్ జనవాహిని రోడ్లపైకి వచ్చారు ఊరికే కాదు - జపాన్ ప్రదాని షింజో అబే తమను రక్షించాలని అంటూ ప్లకార్డులు పట్టుకుని వీధుల్లో ఊరేగింపులు జరుపు తున్నారని అమెరికా మీడియా తెలిపింది.
అందుకు కారణాలు కూడా ఉన్నాయని అంటోంది. మళ్లీ ఉత్తర కొరియా న్యూక్లియర్ మిస్సైల్ పరీక్ష జరిపేందుకు సిద్ధమవు తోందని అదే జపాన్ ప్రజలను మళ్లీ మరింతగా కంగారు పెడుతోందని అమెరికా మీడియా తెలిపింది. ఉత్తర కొరియా సెప్టెంబర్ 3న జరిపిన న్యూక్లియర్ మిస్సైల్ జపాన్ మీదుగా ప్రయాణించింది. దాంతో జపాన్ ప్రజలు రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి పరిస్థితులు ఙ్జప్తికి రాగా వారు మరింత భయాందోళనలకు గురయ్యారని అమెరికా మీడియా తెలిపింది.
న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగాలతో జపాన్ ప్రజలను ఉత్తర కొరియా కంగారు పెట్టింది. ఆ సమయంలో ఇండియాలో పర్యటిస్తు న్న జపాన్ ప్రధాని షింజో అబే గట్టి గానే స్పందించారని ఉత్తర కొరియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని అమెరికా మీడియా గుర్తు చేస్తోంది. దాంతో ప్రజల్లో ఆయన పట్ల గౌరవం మరింత పెరిగిందని అమెరికా మీడియా చెబుతోంది.
ఒకవేళ ఉత్తర కొరియాతో యుద్ధం అనివార్యమైతే అందుకు తమసైన్యాన్ని కూడా ప్రధాని సిద్ధపరుస్తున్నారని అన్నీ పరిణామా లను ఎద్జుర్కొనేందుకు జపాన్ సిద్ధంగానే ఉండబోతుందని అమెరికా మీడియా తెలిపింది. జపాన్ ప్రజలకు ఆయన భరోసా యిస్తున్నారని ఆయన్ని కొనియాడుతోంది. గత కొన్ని నెలలుగా అమెరికా, ఉత్తర కొరియాల మధ్య కొనసాగుతోన్న ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
హిరోషిమా అటమిక్ వార్ తరవాత
ఈ సందర్భంలోనే ఉత్తర కొరియా మరో భయానక వార్నింగ్ ఇచ్చింది. ఏ క్షణంలోనైనా అణు యుద్ధం ప్రారంభమవుతుందని ఐక్యరాజ్యసమితిలో ఉత్తర కొరియా డిప్యూటీ దౌత్యాధికారి కిమ్ ఇన్ ర్యాంగ్ హెచ్చరించారు. అగ్రరాజ్యంనుంచి తమకు ముప్పు పొంచి ఉన్న కారణంగా అణు, క్షిపణి పరీక్షలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటా యని ఐక్యరాజ్యసమితిలో స్పష్టం చేశారు. అమెరికా నుంచి తమకు ముప్పు తొలిగేంత వరకు ఈ కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
the effects of atomic bomb radiations on human health