వరంగల్ లో రెడ్ల ఐక్య శంఖారావం నిర్వహించారు.. తెలంగాణలోని రెడ్ల సంఘాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే దీని లక్ష్యం.. ఈ శంఖారావం సభలో కొన్నిఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.  తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగుల సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ..  సమస్యలు సాధించుకునే వరకూ రెడ్డి సంఘాలు ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపు ఇచ్చారు. త్వరలో రెడ్డి సంఘాల ఐక్యవేదిక ప్రణాళికలను తయారుచేసి హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 


సంతోష్ రెడ్డి.. రెడ్డి సామాజిక వర్గంపై భలే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి అంటే ఓ కులం కాదని ఆయన అన్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఆంధ్రాలో రఘువీరారెడ్డి ఉన్నారు..ఆయన రెడ్డి కాదు.. అలాగే హైదరాబాద్ లోని రాజా డీలక్స్ యజమాని రాజ్యవర్థన్ రెడ్డి ఉన్నారు.. ఆయన రెడ్డి కులానికి చెందిన వారు కాదు. ఆయన కమ్మ.. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది రెడ్డి అనేది కులం కాదు.. 


రెడ్డి అంటే నాయకుడు, పరిపాలకుడు, సామర్థ్యం ఉన్నవాడు అట. అంతే కాదు.. ఈ సభలో తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిపై కొందరు వాటర్ బాటిల్స్ విసిరే ప్రయత్నం చేయడం గందరగోళానికి దారి తీసింది. రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. వివాదానికి కారణమయ్యాయి. రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా ఉన్నాయని, వాటిని మీరు, నేను మార్చలేమని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. 


ఐతే.. అసలు ఈ సభ నిర్వహించిందే  రెడ్డి సామాజిక వర్గంలోని పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని, రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో.. అందుకే సభకు హాజరైన నాయిని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కొందరు ఈ కామెంట్లపై మండిపడుతూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీళ్ల సీసాలతో దాడికి యత్నించారు. సభ నిర్వాహకులు కలుగజేసుకొని మంత్రిని పిలిచి అవమానించడం తగదని నిర్వాహకులు సర్ది చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: