జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ క‌ళ్యాణ్ రాజ‌కీయ పార్టీ జ‌న‌సేన రెండు తెలుగు రాష్ట్రాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి పొలిటిక‌ల్ రోల్ ప్లే చేస్తుంద‌న్న‌ది ఇప్ప‌ట‌కి అయితే ఆస‌క్తిగానే ఉంది. ప‌వ‌న్ రాజ‌కీయ వ్యూహాలు ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌డం లేదు. తాజాగా ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ప‌వ‌న్ జేఏసీ ఏర్పాటు చేయ‌డం రాజ‌కీయంగా మ‌రింత క‌ల‌క‌లం రేపింది. 

Image result for jenasena

ప‌వ‌న్ బాట‌లో న‌డిచేందుకు శివ‌బాలాజీ. శ్రీ‌కాంత్‌, కోట శ్రీ‌నివాస‌రావు, సంపూర్ణేష్ బాబు, బ్ర‌హ్మానందం, అలీ, న‌రేష్‌.. మ‌రికొంద‌రు ఉవ్విళ్లూరుతున్నారు. త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి నీ వెన్నంటే ఉంటాం అంటూ ప్ర‌క‌టించేశారు. ప‌వన్ ఎప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా? అని ఎదురు చూస్తున్నారు. ఈ లిస్టులోనే మ‌రి కొంత మంది సినీన‌టులు కూడా ఉన్నార‌ని తెలుస్తోంది. వీరిలో బిగ్ బాస్ విన్న‌ర్ అయిన శివ‌బాలాజీ ముందుగా ప‌వ‌న్ బాట‌లో న‌డిచేందుకు రెడీ అయ్యి....అన్న వెంటే నేను అని ప్ర‌క‌టించారు.

Image result for jenasena

ఇక ప‌వ‌న్‌కు ముందు నుంచి సెంటిమెంట్ అయిన క‌మెడియ‌న్ ఆలీ సైతం జ‌న‌సేన‌లోకి వెళ‌తార‌ని, ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న ఆ పార్టీలో చేర‌వ‌చ్చ‌న్న టాక్ జ‌న‌సేన వ‌ర్గాల నుంచే వినిపిస్తోంది. ఆలీ రాజ‌మండ్రి నుంచి జ‌న‌సేన త‌ర‌ఫున పోటీచేస్తార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఇక ఈ లిస్టులో ఇటీవ‌ల మ‌రో స్టార్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం పేరు కూడా వినిపించింది. గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బ్ర‌హ్మానందం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా అత్తిలిలో 9 ఏళ్ల పాటు తెలుగు అధ్యాప‌కుడిగా ప‌నిచేశారు.

Image result for jenasena

కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన బ్ర‌హ్మానందం కోస్తాలో కాపులు ఎక్కువుగా ఉన్న ఏదో ఒక సీటు నుంచి పోటీ చేయ‌వ‌చ్చ‌న్న ప్ర‌చారం మొద‌లైంది. ఇక మెగా ఫ్యామిలీకి ఎప్పుడూ స‌పోర్ట్‌గా ఉండే హీరో శ్రీకాంత్ తాను గ‌తంలోనే ప్ర‌జారాజ్యంలో చేరాల‌నుకున్నా కుద‌ర్లేద‌ని ఇప్పుడు జ‌న‌సేన‌లోకి వెళ్లాల‌నుకుంటున్న‌ట్టు త‌న అభిగ‌తం వెల్ల‌డించారు. ఇక సీనియ‌ర్ న‌రేష్ ఎన్టీఆర్‌తో ప‌వ‌న్‌ను పోలుస్తూ న‌రేష్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌న‌మే సృష్టించాయి. ఆయ‌న అసెంబ్లీకి పోటీ చేయాల‌నుకుంటున్నార‌ట‌.

Image result for jenasena

ఇక సీనియ‌ర్ న‌టుడు, బీజేపీ పక్షాన ఎన్నికైన కోటా శ్రీనివాసరావు ఈ సారి జనసేనలోకి వచ్చే ఆలోచన చేస్తున్నారట. ఇక మెగా హీరోల మద్దతు పవన్ కు ఉండే వీలుంది. వీరితో పాటు మ‌రి కొంత మంది యంగ్ హీరోలు కూడా జ‌న‌సేన‌లోకి వ‌చ్చేందుకు రెడీగా ఉన్నార‌ట‌. ప‌వ‌న్ నుంచి గ్రీన్‌సిగ్న‌ల్ రావ‌డ‌మే త‌రువాయి... వ‌చ్చే ఎన్నిక‌ల‌కు కాస్త ముందుగా జ‌న‌సేన‌లోకి చేరిక‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: