ఆధునిక కాలంలో ఒకే తరహా ఆహార నియమాలు పాటిస్తూ మనం అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నాం. మన పూర్వీకులు వాడిన ఎన్నో తృణ ధాన్యాలను మనం మిస్ అవుతున్నాం. అలాంటి తృణ ధాన్యాల్లో చాలా ముఖ్యమైంది కొర్రలు.. ఈ కొర్రలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ కొర్ర గింజలు చిన్నవిగా సుమారు 2 మి. మీ వ్యాసం ఉండి పలుచని పొరతో ఉంటాయి.

Image result for korralu
ఈ కొర్ర గింజలను దంచి పొట్టును సులువుగా వేరు చేస్తారు. ఇవి ఎరుపు , పసుపు , తెలుపు , నలుపు రంగులలో నాలుగు రకాల్లో ఉంటాయి. కొర్రలలో అధికంగా పీచు పదార్ధం , మాంసకృతులు , కాల్షియం , ఐరన్ , మాంగనీష్ , మెగ్నిషియం , ఫాస్ఫరస్తో పాటు విటమిన్లు అధిక పాళ్ళలో ఉంటాయి. చిన్న పిల్లలకు , గర్భిణీలకు కొర్ర  బలవర్ధకమైన ఆహారం. 
కొర్రలు రోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే.. పీచు అధికంగా ఉండటంతో జీర్ణప్రక్రియ మెరుగు పడుతుంది. 

Image result for korralu
మలబద్ధకాన్ని తొలగించడంలో కొర్రలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి ప్రత్యేకంగా షుగర్ రోగులకు ఎంతగానో మేలు చేస్తాయి. కొర్రలు తింటే శరీరం యొక్క బరువు తగ్గుతుంది. శరీరంలో కొవ్వు చేరదు. మానసిక వ్యాధులు కూడా నయమవుతాయి. 

Image result for korralu
కొర్రలో ఉండే మెగ్నిషియం మైగ్రేన్ తల నొప్పులు , హార్ట్ ఎటాక్ లు , గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. నియాసిన్  చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది . అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో పాటు ప్రోటీన్లు  కూడా కొర్రల్లో ఎక్కువగానే ఉన్నాయి. మహిళలకు కొర్రలో ఉండే ఐరన్ రక్తహీనతను తొలగిస్తుంది. వరికి బదులుగా కొర్రలను తింటే చాలా మంచి ఫలితాలు వస్తాయి . 



మరింత సమాచారం తెలుసుకోండి: