భారత మాజీ రిజర్వ్ బాంక్ గవర్నర్ రఘురాం రాజన్ బహుశ బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కు అధినేత అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత గవర్నర్ మార్క్ కార్ని పదవీ కాలం కొద్ది రోజులలో ముగియనున్న సందర్భంలో 'యునైటెడ్ కింగ్డం చాన్సలర్ మరియు ఎక్స్చెక్కర్' పిలిప్ హామండ్ రఘురాం ఈ పదవికి కార్నీ వారసుడుగా అంగీకరించ గలడేమో తెలుసుకోమని పురమాయించారు.
బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అధినేత ఎంపిక ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకముందే సరైన అభ్యర్దికోసం వెతుకులాట మొదలెట్టినట్లు ఆయన మీడియాకు సమాచారమిచ్చారు.
గత మూడు శతాబ్ధాలుగా ఉనికిలో ఉన్న బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అధినేతలుగా ఉన్న వారిలో తొలి విదేశీయుడు మార్క్ కార్ని, పదవీ కాలం జూన్ 2019 తో ముగియనున్న తరుణంలో అంతర్జాతీయ ఆర్ధిక వ్యవహారాలు దేశ దేశాల కేంద్ర బాంకులను నిర్వహించిన అనుభవమున్న వారి కోసం అన్వేషిస్తున్నారు.
Mark Carney Present Bank of England Chief
ఆ అన్వేషణలో వారికి భారత రిజర్వ్ బాంక్ ను అత్యంత విజయవంతంగా నిర్వహించిన అనుభవం తో పాటు అర్ధశాస్త్రంలో చికాగో విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. నోబుల్ బహుమతికి నామినేట్ కూడా అయి ఉన్నారు రఘురాం రాజన్. ఆయనతో పాటు మాజీ మెక్సికన్ కేంద్ర బాంక్ అధినేత అగస్టిన్ కార్స్-టన్స్ కూడా వారి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు అగస్టిన్ 'బాంక్ ఫర్ ఇంటర్నేషణల్ సెటిల్మెంట్స్' ను నిర్వహిస్తున్నారు...ఇలాంటి మొత్తం ఆరుగురు ఆర్థికవేత్తలు రేసులో ఉండగా, వీరిలో రఘురాం రాజన్ ముందంజలో ఉన్నట్లు సమాచారం.
అయితే రఘురాం రాజన్ కు ఈ పదవిపై ఆసక్తి ఉందా? లేదా? అన్న అంశంపై మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. ఆర్బీఐ గవర్నర్‌గా 2013లో బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్ 2016 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన పదవీ కాలాన్ని పొడిగించడానికి కేంద్రం సుముఖంగా ఉన్నా ఆయన మాత్రం కొనసాగడానికి నిరాకరించారు. దీంతో ఉర్జిత్ పటేల్‌కు బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం రఘురాం రాజన్ చికాగో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక అర్థశాస్త్రంలో 2017కు గానూ నోబుల్ పురస్కారాల రేసులో రాజన్ పేరు వినిపించింది. అయితే తుది జాబితాలో మాత్రం ఆయనకు చోటు దక్కలేదు. ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్నప్పుడే 2014 లో "అంతర్జాతీయ మానిటరీ ఫండ్" మేనేజింగ్ డైరెక్టర్ గా అవకాశం వచ్చినప్పటికీ రఘురాం రాజన్ తిరస్కరించారు.
2017లో రఘురాం రాజన్ "ఐ డు వాట్ ఐ డు"పేరుతో భారత రిజర్వ్ బాంక్ గవర్నరుగా ఆయన చేసిన ఉపన్యాసాల సంకలనం ముద్రించారు. అది విఫణిలో "బెస్ట్ సెల్లర్" గా నిలిచిపోయింది. భారత్ 23వ ఆర్ బి ఐ గవర్నరుగా ఉన్న కాలములో టైయిం మాగజైన్ "100 మోస్ట్ ఇన్-ఫ్లుఎన్షీయల్ పీపుల్" లో ఒకరుగా ఎంపికయ్యారు.
![Image result for raghuram rajan bank of englanD chief](https://i.guim.co.uk/img/static/sys-images/Guardian/Pix/pictures/2013/8/6/1375806192260/Indias-chief-economic-adv-010.jpg?w=1200&h=630&q=55&auto=format&usm=12&fit=crop&crop=faces%2Centropy&bm=normal&ba=bottom%2Cleft&blend64=aHR0cHM6Ly91cGxvYWRzLmd1aW0uY28udWsvMjAxOC8wMS8zMS90d2l0dGVyX2RlZmF1bHQucG5n&s=9823534779c234bc450ac948b1abfe46)