చంద్ర బాబు చేస్తే నీతి వేరే వాళ్ళు చేస్తే అవినీతి ఇది చంద్ర బాబు సిద్ధాంతం. చంద్ర బాబు కర్ణాటక లో జరిగిన పరిణామాల గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతుంటే అందరు నవ్వుకుంటున్నారు. తను 23మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని, ఒక ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఇరుక్కుని మరీ చంద్రబాబు నాయుడు కర్ణాటకలో ప్రజాస్వామ్య విలువలకు విఘాతం అనడానికి మించిన ప్రహసనం ఏముంది? అదే అనుకుంటే.. ఇప్పుడు చంద్రబాబు మరో విషయాన్ని సెలవిచ్చాడు.
అదేంటంటే, కర్ణాటకలో తను పిలుపును ఇవ్వడం వల్లనే బీజేపీ ఓడిపోయిందట. ఇదీ చంద్రబాబు ఉవాచ. గాలికిపోయే పిండినంత తన క్రెడిట్‌లోకి వేసుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదు. అయితే ప్రత్యక్ష పరిణామాల గురించి కూడా చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నాడంటే.. కథలో నగ్నంగా ఊరేగే రాజుకు, చంద్రబాబుకు ఏం తేడా లేదనే చెప్పాలి. కర్ణాటక పోలింగ్ అనంతరం బాబు మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల విషయంలో ఎవరినీ ఓడించాలని, గెలిపించాలని తను చెప్పలేదని అన్నాడు.
ఇక ఫలితాల వెల్లడి తర్వాత కూడా చంద్రబాబు తనే బీజేపీని ఓడించాను అని చెప్పలేదు. ఇప్పుడు బీజేపీ అక్కడ గవర్నమెంటును ఫామ్ చేయలేకపోయింది కాబట్టి.. కర్ణాటకలో బీజేపీని తనే ఓడించాను అనే విషయం బాబుకు గుర్తుకు వచ్చింది. ఈయన చెప్పే సొల్లు అభిమానులకు ఇంపుగా ఉందేమో కానీ.. సామాన్య జనానికి మాత్రం ఇదంతా కంపుగా తయారవుతోంది.