సొంత రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తున్న ఏకైక విపక్షం వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ చేపట్టిన ఏపీ బంద్ కు ప్రబుత్వం సహా ఇతర రాజకీయ పక్షాల నుంచి మద్దతు లేదు. అయితేనేం.. ప్రజలే స్వచ్ఛందంగా ఈ బంద్‌ను విజయవంతం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజలే ఈ బంద్‌ను కోరుకుని సక్సెస్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. నిరసన, బంద్ అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తమ హక్కులను సాధించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న గాందేయ మార్గాలు. శాంతియుత బంద్‌కు, ధర్నాలకు దేశంలోని ఏ ప్రబుత్వమూ అడ్డు చెప్పరాదని తాజాగా నిన్నటికి నిన్న సుప్రీం కోర్టు కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఏపీకి సంబంధించిన అత్యంత కీలకమైన వ్యవహారంగా మారిన విభజన చట్టంలోని హామీల అమలు. ప్రత్యేక హోదా అంశంపై ప్రజలు గళం వినిపిస్తున్నారు.
![Image result for ap special status](https://data1.ibtimes.co.in/cache-img-0-450/en/full/682519/1521192882_andhra-pradesh-map.jpg)
పార్టీలతో సంబంధం లేకుండా తమ ప్రయోజనాలు కాపాడే ప్రతి ఒక్కరినీ ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ చేపట్టిన మంగళవారం నాటి బంద్‌ను ప్రజలే స్వచ్ఛందంగా సీరియస్‌గా తీసుకుని విజయం చేస్తున్నారు. బంద్ విషయాన్ని జగన్ ఆకస్మికంగా ప్రకటించారు. పార్లమెంటులో తెలుగు వారికి జరిగిన అన్యాయంపై ఆయన గళం వినిపిస్తున్న విషయం తెలసిందే. సాక్షాత్తూ దేశ ప్రధాని హోదాలో మాజీ పీఎం మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా అమలు చేయడం లేదని జగన్ గత నాలుగు సంవత్సరాలుగా తన బాణిని, వాణిని వినిపిస్తున్నారు. ఈ విషయంలో ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా చేయని సాహసాలు ఆయన ఎన్నో చేశారు. తనకున్న ఎంపీలతోనే కేంద్రంపై పోరు ప్రారంభించిన ఏకైక పార్టీ వైసీపీ.
![Image result for ysrcp](https://i.ytimg.com/vi/f0w-lh_dvUY/maxresdefault.jpg)
ఇక, ఆ సమయంలో కేంద్రం అవిశ్వాస తీర్మానానికి అంగీకరించని పక్షంలో తన ఎంపీలతో రాజీనామాలు చేయిస్తానని చెప్పిన జగన్.. అనుకున్న విధంగా చేయించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన కేంద్రం వైఖరికి నిరసనగా ఏపీ బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి వివిధ రాజకీయ పక్షాల మద్దతును కోరారు. అయితే, జగన్‌ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్న చంద్రబాబుతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్న పవన్, వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు ఈ బంద్‌ను బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించాయి. అయినా కూడా ఒంటరి పోరాటాలు చేయడంలో తనకు తానే సాటి అయిన జగన్.. వెనుదిరిగి చూసుకోలేదు. తనకు ప్రజలే దేవుళ్లని, వారిని నమ్మే తాను పార్టీ పెట్టానని, వారి కోసమే పాదయాత్ర చేస్తున్నానని. ఈ క్రమంలో వారే తన బంద్‌ను విజయవంతం చేస్తారని చెప్పుకొచ్చారు.
ఇచ్చిన పిలుపు ప్రకారం అన్ని జిల్లాల్లోనూ తన పార్టీ నేతలను బంద్‌కు సమాయత్తం చేశారు. ఎక్కడికక్కడ ఆర్టీసీ డిపోలు, ప్రభుత్వ కార్యాలయాల ముందు పార్టీ శ్రేణులు మోహరించాయి. ఇక, ప్రైవేటు విద్యా సంస్థలు ఈ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొని ముందురోజే.. సెలవులు ప్రకటించడం విశేషం. ఇక, ప్రజలు కూడా తమ కార్యకలాపాలాను సోమవారమే ముగించుకుని బంద్‌కు ప్రత్యక్ష మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ అనుకూల మీడియా మౌనం పాటించినా. పలు చానెళ్లు మాత్రంబంద్ తాలూకు దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. వీటిలో ప్రధానంగా విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాలు, కడప, కర్నూలు, చిత్తూరుల్లో బంద్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. మొత్తానికి జగన్ ఒంటరి పోరులోనూ విజయం సాధించాడనడానికి ఇది పెద్ద ఉదాహరణ!