రాజ్‌భవన్‌ ముందు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన తెలంగాణ సామాజిక విద్యార్థి ఉ‍ద్యమకారుడు  గుర్తించారు.  తెలంగాణ అసెంబ్లీ రద్దుకు కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి నిరసనగా ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.


 నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలానికి చెందిన ఈశ్వర్ అనే నిజాం కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ రాజ్ భవన్ గేటు ముందు తనతో తెచ్చుకున్న కిరోసిన్ ను ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకునే ప్రయత్నంలో అక్కడే వున్న రాజ్ భవన్ సిబ్బంది అతని యత్నాన్ని అడ్డుకున్నారు. అతని చేతిలోని అగ్గిపెట్టెను  లాక్కోవడంతో  పెద్ద ప్రమాదం తప్పింది.  ఉద్యమకారులకు, తెలంగాణ కోసం అమరులైన వారికి, నిరుద్యోగ యువతకు ఏం చేశారని చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని ప్రశ్నించారు. కేసిఆర్ ఉద్యమకారులకు ఏం చేసిండో చెప్పాలని ప్రశ్నించాడు.


తెలంగాణలో మేము నీకు అధికారం ఇస్తే ఏం చేస్తున్నవు అని నిలదీశారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలన్నది తన డిమాండని తెలిపాడు. కాగా,   ఈశ్వర్ ఆత్మహత్యాయత్నం చేసిన 20 నిమిషాల వ్యవధిలోనే సిఎం కేసిఆర్ ప్రగతిభవన్ లో కేబినెట్ సమావేశం ముగించుకుని నేరుగా రాజ్ భవన్ కు చేరుకున్నారు. రాజ్ భవన్ లో అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని గవర్నర్ కు అందజేశారు. ఈశ్వర్ గ్రూప్ వన్ బాధితుడు. గతంలో గ్రూప్ అభ్యర్థులు చేసిన ఆందోళనలో ఈశ్వర్ పాల్గొన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: