ట్రిపుల్ తలాక్ పై తమ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానున్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలతో, వివాదస్పద ముస్లిం విడాకులు - ట్రిపుల్ తలాక్ పై కేంద్రం ఒక బిల్లును రూపొందించిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు గడచిన డిసెంబరు 27న లోక్‌సభ ఆమోదం లభించినా, రాజ్యసభలో తగినంత సంఖ్యాబలం బిజెపికి లేకపోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు 2017 లో మోక్షం లభించక, చట్టం కాలేదు.
ఈ బిల్లుకు పలు దఫాలు విపక్షాలన్నీ అడ్డుకోవటంతో కేంద్రం అడ్డంకుల్ని అధిగమించి, రాజ్యసభతో సంబంధం లేకుండా ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదింపజేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే కేంద్రం ప్రతిపాదించిన బిల్లులో కొన్ని సవరణలు చేయాలని విపక్షాలతో పాటు ఎన్డీఏలోని కొన్ని భాగస్వామ్యపార్టీలు కూడా పట్టుబట్టాయి. కేంద్రం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టంగా మారితే భార్య అనుమతి లేకుండా మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకునే సంస్కృతి సాంప్రదాయం నేరమవుతుంది మూడేళ్ల జైలుశిక్షకు కూడా అర్హులు ఔతారు. వీరికి 'నాన్-బెయిలబుల్ వారెంట్ - NBW' జారీ అవుతుంది దానితో పాటు మైనర్ పిల్లలు సంరక్షతబాధ్యతను తండ్రే నిర్వహించాల్సి ఉంటుంది.
అయితే సామాజికంగా అల్పసంఖ్యాకవర్గం పేరుతో అత్యంత రాజకీయ ప్రయోజనం పొందిన పార్టీగా పేరుప్రతిష్టలున్న మజ్లిస్ (ఎం.ఐ.ఎం) ను రాజకీయంగా ఊహాతీత సమస్యాత్మక పరిస్థితుల్లోకి నెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. ముస్లిం మహిళల హక్కుల గురించి ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేని తరుణంలో "ట్రిఫుల్ తలాక్" పేరుతో నరెంద్ర మోడీ, ముస్లిం మహిళల దృష్టిని ఒక్కసారిగ ఆకర్షించారు.
ప్రజాభిప్రాయంతో సంభంధం లేకుండా - ముస్లిం మహిళల్లో అందరూ కాకున్నా, కొందరు మాత్రం ట్రిఫుల్ తలాక్ కారణంగా తీవ్రమైన మనోవ్యధకు గురి అవుతున్నారు. వారి గోడును వినే వ్యవస్థలు లేకపోవటం ఒక దురదృష్టకర మైన అంశంగా చెప్పాలి. ఇలాంటి వేళ, ముస్లిం మహహిళలకు మేము భరోసా ఇవ్వానున్నట్లు "ట్రిఫుల్ తలాక్" మీద తాము రూపొందించిన బిల్లును చట్టంగా మార్చేందుకు చట్టసభలో సంఖ్యాబలం తమకు అనుకూలంగా లేని నేపథ్యంలో కూడా, కేబినెట్ సాయంతో తనకున్న విశేషఅధికారాల్ని ప్రయోగిస్తూ, తాజాగా కేబినెట్ చేత అంగీక రింపజెసి వెనువెంటనే ఆర్డినెన్స్ జారీ చేయటం ద్వారా ప్రధాని నరెంద్ర మోడీ సంచలనం సృష్టించారు.
అయితే ఈ వ్యవహారంపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. ముస్లిం మహిళలకు వ్యతిరేకమైన ఆర్డినెన్స్ గా ఆయన అభివర్ణించారు. ఆర్డినెన్స్ తో ముస్లిం మహిళలకు న్యాయం జరగదని ఆయన వ్యాఖ్యానించారు. ఇస్లాం లో పెళ్లి అన్నది సివిల్ కాంట్రాక్ట్ అని, ఇందులో ప్యానెల్ ప్రొవిజన్లు తీసుకురావటం తప్పన్నారు. ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతి రేకమైనది గా అభివర్ణించారు. మారే కాలానికి తగ్గట్లుగా, మారకుండా ఉంటానంటున్న అసదుద్దీన్ ఒవైసీ మాటలకు ముస్లిం మహిళలు ఎలా స్పందిస్తారో కాలమే సమాధానం చెప్పబోతుంది.
ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ వల్ల ముస్లింమహిళలకు మరింత నష్టం కలుగుతుందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యా నించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ, "ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ముస్లిం మహిళలకు వ్యతిరేకమైన ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్‌తో ముస్లిం మహిళలకు న్యాయం చేకూరదు. ఇస్లాంలో వివాహం అనేది ఓ సివిల్ కాంట్రాక్ట్ అని, ఇందులో ప్యానెల్ ప్రొవిజన్లు తీసుకురావడం తప్పు. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకం, విరుద్ధం. ఒకే నేరానికి ఇతర వర్గాలకు ఏడాది, ముస్లిం వర్గాలకు మూడేళ్లు శిక్ష ఎలా వేస్తారు?.
రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధం. రాజ్యాంగం పేర్కొంటున్న సమాన హక్కుల విషయాన్ని ముస్లింలకు మాత్రమే వర్తింపచేయడం రాజ్యాంగ విరుద్ధం. ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్డినెన్స్‌ను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, మహిళాసంస్థలు కోర్టులో సవాల్ చేయాలి. త్వరలో జరగబోయే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోనుంది. ప్రజల దృష్టి మరల్చేందుకే ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు’ అని అన్నారు.
ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధంముస్లింలు మూడుసార్లు తలాక్ చెబితే ఇకపై నేరం. ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కొత్త ఆర్డినెన్స్‌కు కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది. మూడు సార్లు తలాక్ అని చెబితే, ముస్లిం సంప్రదాయం ప్రకారం విడాకులు ఇచ్చినట్లే. అయితే ఆ సంస్కృతికి స్వస్తి పలకాలని కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది.