నేటి భారత పాకిస్థాన్ రాజకీయ సంబంధాలు :

 
ఒక వైపు స్నెహ హస్తం అందిస్తూ మరో వైపు వెన్నుపోటు పొడవటం పాకిస్థాన్ సహజ స్వభావం. భారత్ స్నేహం కోసం డిల్లీ-లాహోర్ బస్ యాత్రను ప్రారంభిస్తే పాకిస్థాన్ కార్గిల్ లో దురాగతాలు కొనసాగించింది. పాకిస్థాన్ ప్రభుత్వ నేపధ్యంలో ఉంటూ పాలనను కొనసాగించేది మాత్రం సైన్యమే. దానికి ఐ ఎస్ ఐ సహకారం అందిస్తూ వస్తుంది. తెరపై ఇమ్రాన్ ఖాన్ తెర వెనుక సైన్యం ఆడే దంతా నాటకం. ఆడించేది ఐ ఎస్ ఐ మరియు సైన్యమే. 
 
“రెండు దేశాలూ ఒకరినొకరు నిందించుకునే పనిలో ఉండడం వల్లే సంబంధాలు మెరుగుపడడం లేదు. ఈ కారణంగానే ద్వైపాక్షిక సంబంధాలూ ముందుకు సాగడం లేదు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగినా భారత్ మమ్మల్ని నిందిస్తోంది. అలాగే బలూచిస్తాన్ లో ఏం జరిగినా అది భారత్ కుట్రేనని మేం అంటున్నాం. ఈ నిందలను దాటి వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవాల్సి ఉంది. భారత్ మా వైపు ఒక్క అడుగు వేస్తే చాలు! మేం రెండడుగులు వేస్తాం. కానీ, భారత్ వైపు నుంచి ఆ ప్రక్రియ మొదలైతే మంచిది”
 
మహమ్మద్ ఆలి జిన్నా కలలు కన్న పాకిస్తాన్ను సాకారం చేస్తానని, భారత్ తో మంచి సంబంధాలు కోరుకుంటున్నానని ఇమ్రాన్ ఖాన్ పాక్ నూతన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తొలి వారంలో పలికిన చిలక పలుకులవి.  దక్షిణాసియాను ఉగ్రవాద రహితంగా మార్చేందుకు ముందుకు రావాలని ఆనాటి లేఖలో మోదీ అనగా, దీనిపై  ఇమ్రాన్‌ స్పందిస్తూ ద్వైపాక్షిక బంధాలపై మూడుసార్లు సానుకూల ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో భారత్‌ తో చర్చలకు సిద్దమంటూ ఈ నెల 14న నరేంద్ర మోదీకి ఇమ్రాన్‌ లేఖ రాశారు.  “వైరం కన్నా భారత్‌తో స్నేహమే మంచిది అంటోంది పాకిస్థాన్”  ఇరు దేశాల మైత్రి పెంచేందుకు త్వరలో సమావేశం అవుదామంటూ పాక్ ప్రధాని లేఖ రాయగా భారత్ సానుకూలంగా స్పందించింది. ఈనెల 27 భేటీ అవుదామంటూ పాక్‌ కు జవాబిచ్చింది.
అయితే ఇరు దేశాలు న్యూయార్క్ లో చర్చలకు సిద్ధమౌతున్న సమయంలో పాకిస్తాన్ కు భారత్ షాకిచ్చింది. భారత్–పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలను మళ్లీ ప్రారంభించాల్సింది గా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాసిన లేఖను భారత్ తిరస్కరించింది.
 
బుధవారం రామ్‌గడ్‌ సెక్టారు లో ఒక  బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను తూటలు దింపి, గొంతు కోసి అత్యంత  దారుణంగా హత్యచేసిన ఘటన మరవక ముందే గురువారం కశ్మీర్ సరిహద్దుల్లో ముగ్గురు ఎస్పీవో లను పాక్ సైన్యం కిడ్నాప్, చేసి దారుణ హత్య చేసిన నేపథ్యంలో భారత్ ఈ చర్చలను రద్దు చేసుకుంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే ప్రక్రియలో భాగంగా, ఈ నెలలో న్యూయార్క్లో జరగనున్న ‘ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ’  సమావేశానికి హాజరయ్యే భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ కావాలని ఇమ్రాన్ ఖన్ ఇటీవల రాసిన లేఖలో ప్రతిపాదించారు.
 


భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ప్రెస్-మీట్ లో మాట్లాడుతూ, "పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి నుండి వచ్చిన లేఖలో కనిపించిన స్ఫూర్తి కి స్పందనగా ఈ నెలాఖరులో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు న్యూయార్క్ లో సమావేశం అవ్వాలన్న ప్రతిపాదనకు భారత్ అంగీకరించింది. పాకిస్తాన్ ప్రధాని తన లేఖలో రెండు దేశాల మధ్య శాంతి, సామరస్యతతో పాటు, తీవ్రవాదంపై చర్చించేందుకు పాకిస్తాన్ సిద్ధమని అన్నారు. ఇప్పుడు ఈ ప్రతిపాదిత చర్చల వెనకున్న పాక్ దురాలోచన బయట పడింది. పాకిస్తాన్ కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిజస్వరూపం ఏమిటో అతను బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే  ప్రపంచానికి తెలిసిపోయింది.  నిజంగా చెప్పాలంటే పాలకుడెవరైనా పాక్ ను పాలించేది సైన్యమేనని అనటానికి ఇంతకె మించిన ఉదాహరణ వసర్మ్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్తో చర్చలు జరపడం అర్ధరహితమే అవుతుంది. మారిన పరిస్థితులలో భారత్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల సమావేశం ఉండబోదు" అని రవీష్ కుమార్ అన్నారు.

అసలు భారత ప్రధాని నరెంద్ర మోదీకి రాసిన లేఖలో పాకిస్థాన్ నూతన అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ చెప్పిందేమంటే:
 
భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలను పునరుద్ధరించాలంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి సెప్టెంబర్ 14వ తేదీన లేఖ రాశారు. పాక్ ప్రధానిగా బాధ్యతలు అందుకున్న నెలరోజుల్లోనే భారత్ తో చర్చలకు చొరవ చూపి, రెండు దేశాల మధ్య నిలిచి పోయిన చర్చలను మళ్లీ ప్రారంభించాలని లేఖలో పేర్కొన్నారు.
 
సెప్టెంబర్ నెలాఖరులో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ భేటీ కావాలని ఇమ్రాన్ కోరారు. రెండు దేశాల మధ్య అర్థవంతమైన, నిర్మాణాత్మక చర్చలకు సిద్ధమని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మొట్టమొదటిసారి అధికారికంగా స్పందించారు. 


2015 డిసెంబర్లో నిలిచి పోయిన రెండు దేశాల ద్వైపాక్షిక చర్చలు ముందుకు కొనసాగాలని ఇమ్రాన్ ఖన్ లేఖలో కోరినట్టు దౌత్య అధికారుల చెబుతున్నారు. పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై దాడితో ఈ చర్చలకు బ్రేక్ పడింది.
 

తీవ్రవాదం, జమ్ముకశ్మీర్ సహా అన్ని ప్రధాన సమస్యలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కారించు కోవడంపై భారత్-పాక్ దృష్టి పెట్టాలని ఇమ్రాన్ ఖన్ లేఖలో కోరారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఇమ్రాన్ ఖాన్, ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ లేఖకు సానుకూలంగా స్పందించిన భారత్, చర్చలకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే, కశ్మీర్ లో తాజా పరిణామాల నేపథ్యంలో చర్చలను రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది.
 

నేటి భారత్ పాక్ సినిమా నేపథ్యం :

 
పాకిస్థాన్ ఏర్పడిన తరవాత అంటే 1947 నుండి ఇప్పటి వరకు పాకిస్థాన్ పంజాబి సినిమాలు 'పాలీవుడ్' ఆపై లాహోర్ లో సినిమా పరిశ్రమ స్థిరపడి ‘లాలీవుడ్’ గా మారే వరకు సుమారు 10000 సినిమాల వరకు  నిర్మించింది.  పంజాబీ సినిమా రంగాన్ని సాధారణంగా పాలీవుడ్ అని అంటారు. ఇంకా విస్తృతంగా చెప్పాలంటే పాకిస్థాన్, భారత్ ల్లోని "పంజాబీ భాషా సినిమా" రంగాన్ని “పాలీవుడ్” అని పిలుస్తారు. 20వ శతాబ్ద పంజాబీ సినిమా రంగం పాకిస్థాన్ కేంద్రంగా సాగింది. కానీ 21వ శతాబ్ద పంజాబీ సినిమా మాత్రం భారత్ కేంద్రంగా నడుస్తోంది.


మొట్ట మొదటి పంజాబీ సినిమా కలకత్తా లో నిర్మించి, అప్పటి పంజాబ్ బ్రిటిష్ ప్రావిన్స్ కు రాజధాని లాహోర్ లో విడుదలైంది. పాకిస్థాన్ లోని లాహోర్ సినిమా రంగానికి "లాలీవుడ్" అని విస్తృతంగా దీన్ని లాహోర్ - హాలీవుడ్ కలిసి "లాలీవుడ్" అనే పదం తయారైంది. 2009 కల్లా పంజాబీ సినిమా రంగం 900 నుండి 1000 సినిమాలు నిర్మించింది. 1970 లలో సగటున 9, 80 ల్లో 8, 90 లలో 6 సినిమాలు విడుదలయ్యాయి. 1995 లో దాదాపు 11 సినిమాలు, 1996 లో 7, 1997 లో 5 సినిమాలు విడుదల చేసింది "పాలీవుడ్" 2000 దశాబ్దం నుంచి పంజాబీ సినిమా ప్రతీ సంవత్సరం పెద్ద పెద్ద బడ్జెట్లతో సినిమాలు చేయడం మొదలు పెట్టింది.


జనరల్ జియా ఉల్ హక్ పాక్ అధ్యక్షుడైన తర్వాత ఇస్లామీకరణ జరిగి పాకిస్థాన్ సినిమాలపై కొత్త సెన్సార్ నిబంధనలు అమలవటంతో పాకిస్థాన్ సినిమాల నిర్మాణమే తగ్గిపోయింది. 1977 నుండి 2007 వరకు సామాజిక రాజకీయ మార్పుల ప్రభావం లాలీవుడ్ ను పూర్తిగా కుంగదీసింది. ఆ తరవాత కొత్త తరం దర్శకులు లో బడ్జెట్ సినిమాలను కరాచి కేంద్రంగా నిర్మాణాలు చేయటం మొదలుపెట్టారు. క్రమంగా న్యూవేవ్ సినిమా నిర్మాణం ఊపందుకొని నేడు పాక్ భారత్ తో పోటీగా సినిమా నిర్మాణం జరుగుతూవస్తుంది.  


లాహోర్, పంజాబ్ లలోని విస్తారమైన పంజాబీ సంఘం వల్ల పంజాబీ సినిమా రంగం త్వరగానే ప్రాముఖ్యతను సంతరించుకుంది. బాంబే, కలకత్తాల నుండి కళాకారులు, నిర్మాతలు, దర్శకులు లాహోర్ కు మకాం మార్చారు.  పలు స్టూడియోలు కూడా నిర్మించారు.  గత రంజాన్ మాసం సందర్భంగా భారతీయ సినిమాలపై నిషేధం విధిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈద్ కు రెండు రోజుల ముందు నుంచి సెలవులు ముగిసిన రెండు వారాల వరకు భారత్ సహా విదేశాలకు చెందిన ఏ సినిమాను ప్రదర్శించ కూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ అజ సమయంలో ఈ నిషేధం అమల్లో ఉండబోతోంది. ఈ మేరకు సమాచార, ప్రసారాల శాఖలకు పాక్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.


పాక్ లోని స్థానిక సినీ పరిశ్రమకు జీవం పోసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తన నోటిఫికేషన్ లో పాక్ ప్రభుత్వం పేర్కొంది. నిషేధ సమయంలో కేవలం పాకిస్థాన్ కు చెందిన సినిమాలను మాత్రమే ప్రదర్శించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల వల్ల స్థానిక సినిమాలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తమ సినిమాలను ప్రదర్శించడానికి థియేటర్లు కూడా దొరకడం లేదని పాక్ సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, నటీనటులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


మరింత ఉత్కంఠత రేపనున్న భారత్-పాక్ తదుపరి పోరు :


చిరకాల ప్రత్యర్ధులు భారత్ మరియు పాకిస్థాన్ లు ప్రతీ విషయంలోనూ పోటీ పడుతుంటాయి. ఒకప్పటి కాశ్మీర్ నుండి మొన్నటి కార్గిల్ వరకు పాక్ కు, భారత్ కు మధ్య పెద్ద యుద్ధమే నడిచింది, అది ఇప్పటికీ నడుస్తోంది. ఇక ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగిందంటే చాలు ఆ మ్యాచ్ తాలూకు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఎప్పటిలానే భారత్, పాక్, బాంగ్లాదేశ్, మరియుఆఫ్గనిస్తాన్ దేశాల మధ్య సాగే ఆసియా కప్, ప్రతియేడు మాదిరి ఈ ఏడు కూడా మంచి ఉత్కంఠతతో మొదలయింది. అంతే కాదు ఈ కప్ లో జరిగిన తమ తొలి మ్యాచ్లలో బాంగ్లాదేశ్,ఆఫ్గనిస్తాన్లు శ్రీలంకపై విజయం సాధించి మంచి ఆరంభాన్ని ఇచ్చిన విషయం విదితమే. ఇక భారత్ కూడా దాయాధి పాకిస్థాన్ పై తొలిపోరులో అద్భుత విజయాన్ని అందుకుంది...


ఇక భారత్ తో మొన్న జరిగిన మ్యాచ్ లో, పాక్ ఆటగాళ్లలో బాబర్ అజాం, షోయబ్ మాలిక్, ఫహీమ్ అష్రాఫ్, మొహమ్మద్ అమీర్ మినహా మిగతా బ్యాట్స్ మెన్లు ఎవరు కూడా రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోవడం గమనార్హం. ఆ మ్యాచ్ల్లో మొదట్లోనే వికెట్లు సమర్పించుకుంటూ వచ్చిన పాక్ బ్యాట్స్ మన్, మెల్లగా ఒక్కొక్కరుగా పెవిలియన్ ముఖం పట్టారు. మొత్తంగా పాక్ జట్టు మొత్తం 43.1 ఓవర్లకు గాను కేవలం 162 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, కేదార్ జాదవ్ లు పాక్ బ్యాట్స్ మన్ నడ్డి విరిచారు. అత్యల్ప స్కోర్ కావడంతో మంచి జోష్ తో బ్యాటింగ్ కి దిగిన భారత బ్యాట్స్ మాన్ మొదటినుండి మంచి దూకుడుతో ఆడి 162 పరుగుల విజయ లక్ష్యాన్ని 29 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించగలిగారు. 

Image result for pakistan india cricket

ఇక భారత బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధసెంచరీతో 52 పరుగులు చేయగా, మరొక ఓపెనర్ ధావన్ 46 పరుగులు చేసాడు. ఇక ఆ మ్యాచ్ల్లో పాక్ బ్యాట్స్ మాన్ పేలవ ప్రదర్శన కారణంగా ఆ దేశ అభిమానుల నుండి పాక్ జట్టు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. ఇక ఎల్లుండి ఆదివారం ఈ రెండు జట్ల మధ్య జరగబోయే తదుపరి మ్యాచ్ మరింత ఉత్కంఠత రేపనుంది. ఇప్పటికే రెండు జట్లలోని ముఖ్య ఆటగాళ్లు మంచి ప్రాక్టీస్ తో తమ నైపుణ్యాన్ని మరింత పెంచేలా కృషి చేస్తున్నారు. అటు భారత జట్టులోని బ్యాట్స్ మాన్ లలో రోహిత్ శర్మ, శేఖర్ ధావన్, ధోనిలపైనే భారత అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, కేదార్ జాధవ్ లు కనుక గత మ్యాచ్ వలె రాణిస్తే భారతజట్టు విజయం అంత పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి. ఇక పాక్ జట్టు విషయానికి వస్తే కొత్త ఆటగాళ్లు ఎక్కువ ఉండడం, మరోవైపు బ్యాటింగ్ విభాగంలో ఎక్కువ సీనియర్లు లేకపోవడం వారికి ఒకింత గడ్డు సమస్య అనే చెప్పాలి. 

Image result for pakistan india cricket

అయినప్పటికీ ఓపెనర్లు ఇమామ్ ఉల్ హాక్, ఫకర్ జమాన్, షోయబ్ మాలిక్ కనుక రాణిస్తే వారికీ మంచి స్కోర్ దక్కే అవకాశం వుంది. ఇక బౌలింగ్ విభాగంలో మహమ్మద్ అమీర్, ఉస్మాన్ ఖాన్, హాసన్ అలీ కూడా ఆకట్టుకునే ప్రదర్శన కనబరిస్తే వారికి కూడా మంచి అవకాశం వస్తుంది. ఇకపోతే గత మ్యాచ్ లో తమ ఘోర పరాజయానికి ధీటుగా బదులివ్వాలని పాక్ జట్టు ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు భారత జట్టు కూడా ఒక విజయం సాధించిన పట్టుదలతో మరొక విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. చూస్తుంటే ఈ ఆసియా కప్ మరింత ఉత్సాహంగా జరుగుతూ, క్రికెట్ అభిమానులకు వీనులవింది చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే మరి చివరికి ఎవరు ఈ కప్ ను సాధించి విజేతగా నిలుస్తారో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజుల్లో ఓపిక పట్టవలసిం

మరింత సమాచారం తెలుసుకోండి: