అక్రమ
సంబంధం నేరం కాదు - శబరిమలలో
మహిళల ప్రవేశం - తీర్పుల ప్రభావం ఇప్పటికే సమాజంపై దాడి చేయటం మొదలైంది. ఈ తీర్పులు ఈ చట్టాలను అవకాశ వాదులు చుట్టాలుగా మార్చేసుకుంటున్నారు. చూస్తుంటే
ఈ తీర్పులు అభాగ్యులను కాపాడేలాగా లేవు. అవకాశవాదులను అందలమెక్కించి, అభాగ్యులను పాతాళం లోకి తొక్కెసే పరిస్థితులకు దారితీసే సూచనలే
ఎక్కువగా కనిపిస్తున్నాయి. చట్టం, తీర్పులోని మంచి అర్ధమయ్యేలోగానే - అందులోని చెడు
విశ్వాంతరాళాన్ని చుట్టి వస్తుంది. న్యాయస్థానం ఈ తీర్పు ద్వారా సమాజానికి చేయదలచిన లక్ష్యం నెరవేరకుండానే కీడు చీడలా వ్యాపించి పచ్చని వాతావరణాన్ని దహిస్తుంది.
సుప్రీంకోర్టు గత వారం వెలువరించిన రెండు కీలక తీర్పులు సమాజంలో అప్పుడే అనూహ్య విపరీత పరిణామాలకు దారితీశాయి. వివాహేతర సంబంధం నేరం కాదు అన్టూ ఇచ్చిన తీర్పు ప్రభావంతో - చెన్నైలో బరితెగించిన భర్త ఏం చేసుకుంటావో ఛేసుకో ఫో..అన్న తీరుతో కట్టు కున్న భార్య పట్ల అనుచితంగా, నిర్దయగా, కటువుగా, దుర్మార్గంగా ప్రవర్తించాడు. మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం పై పోలీసుల కథనం
రెండేళ్ల క్రితం కార్పొరేషన్ పార్కులో వాచ్మన్ గా పనిచేస్తున్న జాన్పాల్ ఫ్రాంక్లిన్ (26), పుష్పలత (24) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న కుమార్తె కూడా ఉంది.
కొంత కాలంగా పుష్పలత అనారోగ్యానికి గురయ్యింది. ఆమెకు క్షయ వ్యాది ఉందని గ్రహించిన జాన్పాల్ ఫ్రాంక్లిన్ క్రమేణా ఆమెకు దూరం జరుగుతూ, క్రమంగా మందులకు డబ్బులివ్వడం కూడా మానేశాడు. తన వ్యధను ఫ్రాంక్లిన్ స్నేహితుడొకరికి పుష్పలత చెప్పినపుడు, "ఫ్రాంక్లిన్ వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు" అని ఆ స్నేహితుడు అసలు విషయం ఆమెకు చెప్పాడు.
పుష్పలత వెంటనే భర్తను నిలదీసింది. ఆ మహిళతో సంబంధం వదులుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. ఆ మాటలకు జాన్పాల్ ఫ్రాంక్లిన్ వికటాట్టహాసం చేస్తూ:
సుప్రీంకోర్టే వివాహేతర సంబంధం పెట్టుకోవచ్చని చెప్పింది, కాబట్టి పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లేమీ చటానికి వ్యతిరేఖంగా నన్నేమీ చేయలేరు. పోలీసులు నా జోలికి వస్తే వాళ్ల మీదే కోర్టు ధిక్కారం కింద కేసు వేస్తాను అంటూ నేను నా ఇష్టం నేను ఇలాగే ఉంటా. ఇష్టమైతే నాతో ఉండు, లేకుంటే వెళ్లిపో!" అంటూ ఈసడించుకున్నాడు. ఆపై ఇష్టమొచ్చినట్టు తిట్టాడట.
Husband’s Extra-Marital Affair Drives Wife To Suicide
భర్త వైఖరితో పుష్పలత కుంగిపోయింది. పోలీసులూ, న్యాయస్థానాలు, చట్టాలు తనకు సాయం ఏవిధంగాను సాయం రావన్న భర్త మాటలతో షాకుకు గురైంది. తనుపడ్ద వ్యధనంతా "సూసైడ్ నోట్" లో రాసి ఆ అభాగిని పుష్పలత సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణం తరువాత- తనను ప్రశ్నించిన పోలీసుల ను కూడా జాన్పాల్ ఫ్రాంక్లిన్ ఎదిరించి నట్లు తెలుస్తుంది.
కేరళలోని శబరిమలలో అక్కడున్న అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య మహిళలూ ప్రవేశించవచ్చన్న తీర్పుతో జీవితం మీద విరక్తి చెంది ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ముఖ్యంగా చెన్నైలోని నెసపాక్కం ప్రాంతంలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది.
Supreme Court Allows Entry Of Women Into Sabarimala Temple