చాణక్యడు
భారతదేశాన్ని ఏకీకృతం చేసేందుకు, ఏకీకృత భారత్ కు పటిష్టమైన సమర్ధవంత
మైన పరిపాలన అందించటానికి మాత్రమే వ్యూహాలు పన్ని జాతిని యవన దండయాత్రలను ఎదుర్కొనేలా
తీర్చిదిద్దాడు. ఇక్కడ ఏమాత్రమూ స్వార్ద ప్రయోజనాలు ఆయన ఆశించలేదు. ఒక
యోగిపుంగవునిలా జంబూ ద్వీపాన్ని ఏకం
చేసి రాజ్యం లేని చోట రాజ్యాన్ని,
సార్వభౌముడే లేని చోట చంద్రగుప్త
సార్వభౌముణ్ణి, అమాత్య పుంగవుడే లేనిచోట శతృవైన రాక్షసామాత్యునికి వేరే దారి లేకుండా
చేసి సమర్ధవంతమైన అమాత్యుణ్ని, పాలనా విధానమే లేని చోట అర్ధశాస్త్రాన్ని
సృష్టించినా, అంతా దేశం కోసమే
చేశారు కాని తన స్వప్రయోజనాలకు
మాత్రం కాదు.
అపర
చాణక్యుడని స్వపరిజన, స్వసామాజిక మద్దతు మీడియా ఘోషినట్లు నారా చంద్రబాబు నాయుడు
ఆయన అపర చాణక్యుడు మాత్రం
కాదు కాని.. స్వపరిజన సేవలో తరించిన అపర రాక్షసామాత్యుడు అని
చంద్రబాబును అనవచ్చు. నాడు రాక్షసుడు అంటే
తక్షశిల విశ్వవిద్యా లయంలో చాణక్యుని సహవిద్యార్ధి. మగధ సామ్రాజ్యాన్ని నందులపాలనలో
సంఘటిత శక్తిగా మలచటంలో మంత్రిగా తన చాకచక్యాన్ని ప్రదర్శించినా
ఆయన
అపారఙ్జాన్ని
మహపద్మనందుని మొదలుకొని దృతరాష్ట్ర
సంతతిలాంటి
ధననందునితో
కూడి
నవనందులుగా
చరిత్ర
కెక్కిన ఎనిమిదిమంది సహోదరుల
సేవకే
అంకితం
చేశాడు.
ఇప్పుడు
ఈ సందర్భంలో స్వార్ధం కోసం రాజకీయాలు వ్యూహాలు
ఉత్స్వాస నిత్స్వాసాలుగా జీవిస్తూ, రాష్ట్ర
ప్రయోజనాలు
మరచి
స్వ కుటుంబ, స్వజన, స్వకుల,
స్వమిత్రజన,
స్వపరిజన సేవే పరమావధిగా జీవితంగా
బ్రతికేస్తున్నారు.
ఆయన
ఏ
సభలోనైనా
రాజకీయం
వ్యూహం
లేకుండా మాట్లాడింది లేశ
మాత్రం కూడా కనిపించదు.
ఇప్పుడు కూకటపల్లి నియోజక వర్గంలో నందమూరి సుహాసినిని శాసనసభ స్థానానికి అభ్యర్ధిగా నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేయటంలోని అర్ధాలు పరమార్ధాలు, రాజకీయాలపై ఒక అవగాహన కోసమే ఈ వ్యాసం.
ఇలాంటి తెలివి తేటల విషయంలో చంద్రబాబుకు తిరుగులేదు. ఎప్పుడు ఎవరిని వాడుకోవాలో చంద్రబాబుకు బాగా తెలుసు. అసలు ఎవరూ ఊహించని రీతిలో చంద్ర బాబు నిర్ణయాలు తీసు కొంటూ ఉంటాడు. ఇప్పుడు కూకటపల్లి శాసన సభ స్థానాన్ని నందమూరి హరికృష్ణ కూతురు “నందమూరి సుహాసిని” కు ఖరారు చేయడం కూడా అలాంటిదే అని చెప్పవచ్చు.
మొన్నటి వరకూ హరికృష్ణకు కూతురుంది
అనే విషయం తెలిసింది చాలా తక్కువ మందికే.
అయితే ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చి వార్తల్లోని వ్యక్తిగా చేస్తున్నాడు. ఇది వ్యూహాత్మకం. నందమూరి
కుటుంబాన్ని రాజకీయాల్లో ఉంచడం చంద్రబాబు కు పెద్దగా ఆమోదయోగ్యం కాదు అందునా ప్రత్యేకించి
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో
ఉంచడం అస్సలు ఇష్టం ఉండదు.
కారణం అక్కడ నందమూరి ‘వంశాంకురం’ రాజకీయాల్లో ఉంటే తన ‘వంశాంకురం నారా లోకెష్ నాయుడు’ కు భష్యత్ రాజకీయాల్లో అడ్దువస్తారేమోనని భయం. ఈ సంధర్భంలో చెప్పుకోవలసిన ముఖ్యవిషయం జూనియర్ నందమూరి తారక రామారావు – తాను “వెన్నుపై వెటేసి” తెలుగుదేశంపార్టీని, ప్రభుత్వాన్ని, పాలనను, అభిమానులను హైజాక్ చేసిన ఎన్ టి ఆర్ ను ముమ్మూర్తుల పోలి ఉండే జూనియర్ అంటే పక్క తడిపేసుకుంటాడు.
ఎప్పటికైనా పప్పు లోకెష్ కు మొగుడు, చురుకైన, అద్భుత వాక్చాతుర్యం, రూపం ఉన్న జూనియర్ ఎన్టిఆర్ మాత్రమే. ఇది జగమెరిగిన సత్యం. చంద్రబాబు అపర చాణక్యుడైతే జూనియర్ ఎన్టిఆర్ మాత్రమె ను రాజకీయాల్లోకి తెచ్చి ఉండేవాడు. రాక్షసామత్యుడైతే నందమూరి కుటుంబాన్ని సామరస్యంగా చూసేవాడు. అందుకే ఆయన రాజకీయవ్యూహాలను శకునితో పోల్చవచ్చు.
చంద్రబాబు.
వ్యూహాలు పన్నుతూ ఆకుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేస్తూ రాజకీయాధికారం అనుభవిస్తున్న చంద్రబాబు అందుకే
ఆయన
శకునికి
ఎక్కువ
రాక్షసామాత్యునికి
తక్కువ.
చాణక్యునితో
పోలికకే
ఆస్కారంలేదు. అందుకే
వారిని తెలంగాణకే పరిమితం చేసైనా వారిని తెలంగాణా రాజకీయరంగంలోకి దించు తున్నాడు. అది కూడా ఆడవాళ్లకు
అవకాశం ఇస్తుండటం విశేషం. వాళ్లైతే అంత త్వరగా ఎదురు
తిరగలేరు. అందుకే హరికృష్ణ తనయులకు గాక. హరి కూతురుకు
చంద్రబాబు అవకాశం ఇస్తున్నాడు.
అలాగే ఇప్పుడు ఆమెను గెలిపించుకునే బాధ్యతను సైతం వ్యూహాత్మకంగా సోదరీ సోదరుల అనుబంధం అనే సెంటిమెంట్ ప్రయోగించిన చంద్రబాబు నాయుడు హరి తనయులైన కళ్యాణ్ - జూనియర్ ఎన్ టి ఆర్ ల మీద పెట్టేస్తాడు. దీంతోవాళ్లు తప్పనిసరిగా ఆమెకు అనుకూలంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు చెప్పి నట్టుగా వినాల్సి ఉంది. ఆమెను గెలిపించు కునే భారం కూడా తానుగాని తెలుగుదేశం పార్టీ గాని తీసుకోదని అర్ధం.
ఎలాగూ నందమూరి హరికృష్ణ కారు ప్రమా దంలో హృదయవిదారకంగా మరణించిన సానుభూతి ఉంటుంది కాబట్టి, ఆమె విజయం కూడా నల్లేరు మీద నడకలా సాగ వచ్చు సాధ్యపడవచ్చు. మొత్తానికి చంద్రబాబు - బాహుబలిలో ప్రభాస్ అనుష్కల్లాగా ఒకే శరసంధానంతో అనేక పిట్టలను కొడుతున్నాడనమాట!
కూకటపల్లి నుంచి టీడీపీ తరఫున శాసనసభ సభ్యత్వం కోసం పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకుని, నియోజకవర్గంలో పార్టీ బాగు కోసం ప్రయత్నిస్తోన్న వారందర్నీ పక్కనపెట్టి, టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డిని తొలుత చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఇప్పుడు నందమూరి కుటుమబం పై ఆధిపత్య సాధన జూనియర్ ను రాజకీయాలకు దూరం పెట్టటం కోసం చివరికి ఆ పెద్దిరెడ్డికి కూడా చెయ్యిచ్చి నందమూరి సుహాసినిని పోటీకి నిలబెట్టబోతున్నాడు చంద్రబాబు.
నందమూరి కుటుంబానికి ఎంతోకొంత ప్రజాభిమానం ఉంది. తన నారా కుటుంబం ప్రజల్లోకి వెళితే అంతగా లాభించదని తెలిసిన చంద్రబాబు రాజకీయ వ్యూహం తోనే బావమరిదిని నందమూరి బాలకృష్ణను వియ్యంకుణ్ణి చేసుకొని ఆయన్ని ఆ కుటుంబానికి దూరం చేసుకొని అంటే తనకు దగ్గరగా మార్చుకొని హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరి లోకి దింపిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తన కుమారుడు నారా లోకేష్‌ని మాత్రం, "నామినేటెడ్" కోటాలో శాసన మండలికి పంపి మంత్రిని చేశారు. 'నందమూరి' కుటుంబంపై 'నారా' కుటుంబానికి ఉన్న అనుపమానమైన అపారమైన అభిమానానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఇంకేముంటుంది.
ఇప్పుడు, కూకటపల్లి నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేయటంలోని చంద్రబాబు ఉద్దేశమూ అదే. నందమూరి హరికృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు గనుక, ఆ సానుభూతి సుహాసిని మీద వర్కవుట్ అయితే, ఎమ్మెల్యేగా ఆమెకు అవకాశం ఇచ్చిన పేరు తనకు దక్కుతుంది. నందమూరి కుటుంబాన్ని దూరం పెట్టాడన్న అపప్రద పోతుందన్నది చంద్రబాబు ఆలోచన కావొచ్చు.
కానీ, కూకట్పల్లి నియోజకవర్గంలో పరిస్థితులు ఇప్పుడు ఎలా వున్నాయో, అన్న విషయంపై ఇంటెలిజెన్స్ నివేదికలు చంద్రబాబు తెప్పించు కోకుండా చంద్ర బాబు ఉండరు కదా! అన్నీ తెలిసిన ఈ రాజకీయ వ్యూహ ప్రాణి అందుకే నందమూరి సుహాసినిని రాజకీయతెరపైకి తీసుకొస్తున్నారు. గెలుపు కష్టమైనా జూనియర్ ఎన్ టి ఆర్ కళ్యాణ్ రాం బాలకృష్ణలు ప్రచారం చేసైనా గెలిపిస్తారు అన్న ధీమా. అదే వేరెవరికైనా అంటే జూనియర్ ఎన్ టి ఆర్ ప్రచారానికి సున్నితంగా తిరస్కరించవచ్చు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్ లేకుండా కూకట్‌పల్లిలో ఆమె గెలుపు అంత తేలికకాదు. అదృష్టం కలిసొచ్చి గెలిచినా, తెలంగాణ రాజకీయాల్లో నిలదొక్కుకునేంత రాజకీయ అనుభవం సుహాసినికి వుంటుందని అనుకోలేం. ఎందుకంటే, ఆమె రాజకీయాలకు కొత్త. కూకట్పల్లి నుంచి 2014 ఎన్నికల్లో అప్పటి టీడీపీ నేత మాధవరం కృష్ణారావు గెలిచారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి మాధవరం కృష్ణారావు బరిలో నిలిచారు.
కమ్మ సామాజిక వర్గం ఓటర్లు, సీమాంధ్ర ఓట్లు, వీటన్నిటికీ మించి నందమూరి అభిమానులే కూకటపల్లిలో టీడీపీని గెలిపించేస్తారని చంద్రబాబు నమ్ముతున్నారంటే.. అది కూడా నమ్మగలిగే విషయమే కాదు. పార్టీలో నందమూరి కుటుంబానికి 'అవకాశం' ఇస్తున్నామని చెప్పుకోవడానికే చంద్రబాబు ఈ తుశ్చపు ఎత్తుగడ వేశారు. సుహాసిని పేరు తెరపైకి రావడంతో, ఇతర రాజకీయ పార్టీలు 'అయ్యోపాపం నందమూరి కుటుంబం' అంటూ కొంత హరికృష్న మ్హఠాన్మరణం తో కాస్తంత జాలి చూపించాల్సిన పరి స్థితి ఓటర్లకు దాపురించింది. నందమూరి తారకరామారావు నుంచి టీడీపీని లాగేసుకున్న నారా చంద్రబాబు, ఆ నందమూరి కుటుంబంపై ఇంకా 'నారా' రాజకీయ కూట నీతిని ప్రయోగిస్తూనే వుండడం శోచనీయం.
ఇకపోతే తొలినుంచి కూకటపల్లి టిక్కెట్ ఆశిస్తూ వస్తున ఈ.పెద్దిరెడ్డి మాత్రం దురదృష్టవంతుడై పోయాడు. పోతేపోయాడు ఆయన తెలంగాణావాడు. తనకు సంభంధించి నంత వరకు పార్టీలో ఉన్న శతకోటిలింగాల్లో ఒక బోడిలింగం అనేది చంద్రబాబు భావన.
మొత్తం తతంగంలో ప్రజాశ్రేయస్సుగాని ఓటర్లకు విలువ యివ్వటంగాని లేదుకదా! దీన్ని పోల్ మానెజ్మెంట్ అంటారు గెలుపు ప్రధానంగా చేసే రాజకీయం నవనందులు రాక్షసామాత్యుని నీడలో అనుసరించిన కూటనీతి - కౌరవులు శకునిని దుష్టచతుష్టయంలో బాగం చేసుకొని పన్నిన కుటిలక్రౌర్య నీతి. ఇదే నేడు చంద్ర బాబు మదినిండా కమ్ముకున్న రాజకీయ తంత్రం. అదే తెలంగాణాపై పగబట్టిన కాలసర్ప పడగనీడ . ఆయనకు వ్యూహాలు రాజకీయాలే ఊపిరి! చంద్రబాబు పడగనీడలో తెలంగాణా! చివరికి నందమూరి కుటుంబం కూడా!