చంద్రబాబునాయుడును ప్రదానమంత్రి నరేంద్రమోడి ఏమాత్రం లెక్క చేయటం
లేదు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇళ్ళ, కార్యాలయాలపై తాజాగా జరిగిన ఇడి దాడులే
అందుకు సాక్ష్యం. శుక్రవారం రాత్రి హైదరాబాద్ కార్యాలయాలపై మొదలైన ఇడి దాడులు
శనివారం ఉదయానిక్కూడా జరుగుతునే ఉన్నాయి. చెన్నై నుండి వచ్చిన అధికారుల బృందాలు
సోదాలు జరుపుతున్నాయి. తెలుగుదేశంపార్టీ మీద నరేంద్రమోడి కక్ష సాధిస్తున్నారని
అందుకే సిబిఐ, ఐటి, ఇడి దాడులు చేయిస్తున్నట్లు చంద్రబాబు పదే పదే
ఆక్రోసిస్తున్నారు. కేంద్రానికి ఎదురుతిరిగి సిబిఐ దాడులను రాష్ట్రంలో జరగనిచ్చేది లేదంటూ సిబిఐ
ఎంట్రీని అడ్డుకున్నారు. అయినా ఇడి దాడులు ఆగలేదు.
సిబిఐ దాడులకు నో ఎంట్రీ అంటూ ఉత్తర్వులు జారీ చేయగలిగిన చంద్రబాబు ఐటి, ఇడిలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. హై కోర్టు గనుక విచారణకు ఆదేశిస్తే సిబిఐ దాడులు, విచారణను కూడా అడ్డుకోలేరనుకోండి అది వేరే సంగతి. చంద్రబాబు జారీ చేసిన ఉత్తర్వులు నాలుక గీసుకోవటానికి కూడా ఉపయోగపడని న్యాయ నిపుణులు చెబుతునే ఉన్నారు. ఉత్తర్వులపై ఒకవైపు రాష్ట్రంలో గోల జరుగుతుండగానే మరోవైపు ఈడి దాడులు జరగటం గమనార్హం. సుజనా పై దాడులు ఇదే మొదటిసారి కాదు. పోయిన అక్టోబర్ లో కూడా ఈడి దాడులు చేసి హార్డు డిస్కులను, కీలక పత్రాలను స్వధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అది అలా ఉండగానే మళ్ళీ దాడులు జరగటం ఆశ్చర్యంగా ఉంది.
బ్యాంకుల్లో లోన్లు తీసుకుని వందల కోట్ల రూపాయలు ఎగొట్టిన ఆరోపణలున్నాయ. ఇదే విషయమై గతంలో మారిషస్ కు చెందిన ఓ బ్యాంకు సుజనా పై కేసు కూడా వేసింది. ఆ కేసులో నాంపల్లి కోర్టు సుజనా కేంద్రమంత్రిగా ఉండగానే నాన్ బెయిలబుల్ అరెస్టు కూడా జారీ చేసింది. ఆ వారెంటును కొట్టేయించుకోవటానికి అప్పట్లో సుజనా కిందామీదా పడ్డారు. బ్యాంకులకు రుణాలు ఎగొట్టిన కేసుల్లో సుజనాను సిబిఐ డిఫాల్టర్ గా గుర్తించింది. అందుకే ఈరోజు ఈడి దాడులు చేసింది. రుణాల ఎగవేతకు సంబంధించిన పత్రాలతో పాటు హార్డ్ డిస్కులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇలా వరుసబెట్టి దాడులు చేయటమేనా లేకపోతే యాక్షన్ తీసుకునేదేమైనా ఉందా అన్నదే తేలాలి.