షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియ కొత్త బేరాలను తెరపైకి తెస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అసలు చంద్రబాబునాయుడు భూమా కుటుంబానికి టిక్కెట్టిచ్చేదే డౌటని ఒకవైపు తెలుగుదేశంపార్టీలోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. కానీ దానికి రివర్సులో చంద్రబాబుతో అఖిల కొత్తగా బేరాలు మొదలుపెట్టిందని ప్రచారం ఊపందుకుంది. రానున్ని ఎన్నికల్లో తమ కుటుంబానికి మూడు టిక్కెట్లు కావాలని అడుగుతోందట. నంద్యాల అసెంబ్లీలో సోదరుడు, సిట్టింగ్ ఎంఎల్ఏ భూమా బ్రహ్మానందరెడ్డికి మళ్ళీ టిక్కెట్టు కావాలట. అందులో తప్పేమీ లేదు లేండి.

 Image result for akhila priya photos

అయితే, అదే సందర్భంలో నంద్యాల ఎంపిగా తన భర్త భార్గవ్ కు టిక్కెట్టు కావాలని పట్టుబడుతోందని సమాచారం. ఈమధ్యనే భార్గవ్ ను ఫిరాయింపు మంత్రి ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. కాబట్టి భర్తకు టిక్కెట్టు కోసం భార్య సిఫారసు చేస్తోందట. మామూలుగా భర్తలే భార్యలకో లేకపోతే సంతానానికో టిక్కెట్లు బేరం పెడతారు. కానీ అఖిలది రివర్స్ బేరం లాగుంది. వచ్చే ఎన్నికల్లో భూమా కుటుంబానికే టిక్కెట్లు దక్కేది అనుమానమని ప్రచారం జరుగుతుంటే అఖిలేమో ఏకంగా భర్తకు నంద్యాల ఎంపి టిక్కెట్టు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్నారట. ఇక మిగిలిన మూడోది తన కోసం ఆళ్ళగడ్డ టిక్కెట్టు.

 Image result for akhila priya photos

పార్టీ వర్గాల ప్రకారమైతే చంద్రబాబు చేయించుకుంటున్న సర్వేల్లో అఖిల, బ్రహ్మరందరెడ్డి ఇద్దరి గురించి బ్యాడ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందట. ఎందుకంటే, అఖిలకేమో పార్టీలో ఎవరితోను పడటం లేదు. నంద్యాల, ఆళ్ళగడ్డలో టిక్కెట్ల కోసం భూమా కుటుంబానికి వ్యతిరేకంగా మూడు గ్రూపులు టిక్కెట్ల కోసం పోటీ పడపతున్నాయి. గ్రూపుల గోల ఏ స్ధాయిలో ఉందంటే ఎవరికి టిక్కెట్టిచ్చిన మిగిలిన మూడు గ్రూపులు వ్యతిరేకం చేసే స్ధాయిలో ఉంది. ఈ స్ధితిలో అసలు భూమా కుటుంబానికి టిక్కెట్లు రావటమే గొప్ప. అలాంటిది మూడు టిక్కెట్లు కావాలంటూ ఫిరాయింపు మంత్రి చంద్రబాబుతో బేరం పెట్టటం విచిత్రంగానే ఉంది. మరి చంద్రబాబు  ఏం చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: