ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారింది ,ఊహించని పరిణామాలు ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటూనే ఉంటాయి .  చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవనాలు కాదు .. సునామీ నే స్పష్టంగా కనిపిస్తోంది . ఈ నేపథ్యంలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తీసుకున్న తాజా నిర్ణయం సంచలనంగా మారింది.

Image result for tdp telangana


  రీసెంట్ గా తెలంగాణ ప్రాంతంలో చావు దెబ్బ తిన్న టిడిపి పార్టీకి ఆంధ్రప్రదేశ్లోనూ పరిస్థితి నల్లేరు మీద నడక కాదని తేలిపోయింది.  చీరాల ఎమ్మెల్యే మంచి వైకాపాలోకి వచ్చేసినట్టే అధికారికంగా కొన్ని గంటల్లో ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారు. 
రానున్న సార్వత్రిక ఎన్నికల మీద గంపెడు ఆశలు పెట్టుకున్న చంద్రబాబు కి ఇది అతిపెద్ద దెబ్బ అనే చెప్పాలి .

Image result for amanchi krishna mohan


ఆమంచి లాంటి స్టామినా , పాపులారిటీ ఉన్న ఎమ్మెల్యే టీడీపీ కి గుడ్ బై చెప్పడం చిన్నా చితకా విషయం ఏమీ కాదు. కాపులలో బలమైన నాయకుడిగా ప్రకాశం జిల్లా తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలని విపరీతంగా ప్రభావితం చెయ్యగల నాయకుడిగా ఆమంచి కి మంచి ఛరిష్మా ఉంది. అదే కారణం తో ఒంటరిగా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆమంచి ని పనిగట్టుకుని మరీ బతిమాలి పార్టీ లో జాయిన్ చేయించుకున్నారు చంద్రబాబు.

Related image


ఈ జిల్లా మీద పట్టు కోసం వేసిన అడుగుల్లో అప్పట్లో ఇది చాలా కీలక అడుగు అని విశ్లేషకులు సైతం అభిప్రాయ పడేవారు . గత అనేక ఎన్నికల నుంచి తిరుగులేని మాస్ లీడర్ గా ఎదుగుతూ ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఒంటరిగా పోటీ చేసి గెలవగల సత్తా ఉన్న ఆమంచి కి చీరాల లో తిరుగు లేదు అనే చెప్పాలి ... పోటీ అనేది ఈ రోజు వరకూ ఆమంచి కి చీరాల చుట్టుపక్కల కనిపించలేదు అంతే అతిశయోక్తి కాదు.

Image result for amanchi krishna mohan jagan

ఆమంచి పార్టీ మారుతున్నారు అనే వార్తలు రాగానే సిద్దా రాఘవురావు తో పాటు మరి కొందరు మంత్రులు ఆమంచి ని పర్సనల్ గా ఇంటికి వెళ్లి మరీ బాబు తరఫున బతిమాలినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వారి మాటలని మినిమమ్ కూడా కేర్ చెయ్యని కృష్ణ మోహన్ తాను ససేమిరా పార్టీ లో ఉండను అని తేల్చి చెప్పేశారట.

Image result for tdp cabinet


పార్టీ తన యాటిట్యూడ్ ని చంపేసే ప్రయత్నం చేసింది అనీ పార్టీ యొక్క ప్రతిష్ట కోసం తాను పాటు పడే ప్రయత్నం చేస్తే తన కి ఏమీ మిగలకుండా చెయ్యాలని అధినాయకత్వం ప్రయత్నం చేసింది అనీ రుజువులతో సహా చూపించారాత్ ఆమంచి. అంతే బాబు తరఫున వెళ్లిన ఇద్దరు  మంత్రులకూ నోట్లో మాట రాలేదు అని చెబుతున్నారు.

Image result for ysrcp flags


ఆమంచి తోనే ఆంధ్ర ప్రదేశ్ లో బాబు పతనం  మొదలైంది అని వైకాపా శ్రేణులు కామెంట్ చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: