సాక్షి మీడియా ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ వి అన్న విషయం అందరికీ తెలిసిందే. తమ పార్టీ, అధినేత వైఖరికి అనుకూలంగానే ఈ పత్రిక కథనాలు ఉంటాయి. అందుకే సాక్షి మీడియా అంటే చాలు చంద్రబాబు ఒంటికాలిపై లేస్తుంటారు. పదే పదే ఆ మీడియాపై బహిరంగంగానూ విమర్శలు చేస్తుంటారు.

Image result for chandrababu on sakshi


కేవలం విమర్శలతోనే కాకుండా ఇప్పుడు చంద్రబాబు మరోరకంగా కూడా సాక్షి మీడియాపై తన కోపం ప్రదర్శించారు. అదే ప్రకటనలు.. మీడియాకు ప్రచార ప్రకటనలు ఇవ్వడంలో ఏపీ ప్రభుత్వం సాక్షి మీడియా పట్ల వివక్ష చూపించింది. ఈ విషయాన్ని కాగ్ కూడా తప్పు పట్టింది.

Related image


ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు అత్యధిక బిజినెస్‌ను కల్పించారని, భారీ సర్క్యులేషన్‌ గల సాక్షి పత్రికకు మాత్రం అతి తక్కువ బిజినెస్‌ను కల్పించారని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఇందుకు కారణాలు ఏమిటో తెలియజేయాలని సమాచార శాఖను కోరింది. దీనిపై సమాచార శాఖ కమిషనర్‌ కాగ్‌కు లిఖిత పూర్వక సమాధానమిస్తూ.. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకే ఇలా చేశామని తేల్చి చెప్పారు.

Related image


2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2017–18 వరకు మూడేళ్లలో సమాచార శాఖ ప్రచార ప్రకటనలకు 125. 42 కోట్లు ఖర్చు చేసిందట. ఇందులో దాదపు సగం అంటే.. 54.04 కోట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకే కేటాయించారట. సర్క్యులేషన్‌ ఆంధ్రజ్యోతి కంటే ఎక్కువ ఉన్న సాక్షి పత్రికకు మాత్రం కేవలం 9 కోట్ల రూపాయలే ఇచ్చారట. బాబు సాక్షిపై తన కోపాన్ని ఇలా చూపించారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: