జనాభిప్రాయం జగన్ ను మార్చిందా! రాజకీయంలో అనుమానానికి తావివ్వవద్దనే ఉద్దేశంతో పారదర్శకత కోసమో ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై వచ్చే విమర్శలు ఆరోపణల విషయంలో ఆయన అప్రమత్తంగా ఉంటున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా సోషల్ మీడియా ఓటర్ల మీద ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో తనపై జరిగే “నెగిటివ్ ఎమోషనల్” ప్రచారానికి చెక్ చెప్పాలన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఏపీ విపక్ష నేతగా వ్యవహరిస్తూ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కూర్చొని టికెట్లను డిసైడ్ చేస్తారా?
అభ్యర్థుల జాబితాను హైదరాబాద్ లో కూర్చునే సిద్ధం చేయాలా?
రేపు అధికారం వచ్చినా హైదరాబాద్‌లో కూర్చునే సీఎంగా వ్యవహరిస్తారా?
అంటూ వ్యతిరేఖులనుండి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వీలుగా జగన్ తాజాగా తన టూర్ ప్లాన్ ను మార్చుకున్నట్లు చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపికతో పాటు నేతలని కలవటం వారిని బుజ్జగించటం టికెట్ల హామీలు ఇవ్వటం లాంటి పరిణామాలు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వేదికగా సాగుతున్నాయి. దీనిపై జగన్ ప్రత్యర్థులు వెలెత్తి చూపిస్తూ తప్ప పడుతున్నారు.
ఏపీలో జరిగే ఎన్నికల అభ్యర్థుల కసరత్తు వేరే రాష్ట్ర రాజధానిలో కూర్చొని చేస్తారా? అంటూ సాగుతున్న ప్రచారంతో జగన్ పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. దీనికి సూటిగా సమాధానం చెప్పలేకపోతున్న పరిస్థితి. దీంతో ప్రత్యర్థులకు ఎక్కువ అవకాశం ఇవ్వటం మంచిది కాదన్న సూచనతో జగన్ లోటస్ పాండ్ నుంచి పులివెందులకు నేటి నుండి వెళ్లిపోనున్నట్లుగా చెబుతున్నారు.
అభ్యర్థుల జాబితా వెల్లడి ఇడుపులపాయ నుంచి చేయాల్సిన నేపథ్యంలో హైదరాబాద్ ను విడిచి పులివెందులకు ప్రయాణం కావటానికి కారణం తన ప్రత్యర్థులు చేస్తున్న నెగిటివ్ ప్రచారంగా చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ను చూస్తే, ఆయన రాజకీయం చేసేది ఏపీలో ఉండేది హైదరాబాద్‌లో అన్న విమర్శ బలంగా వినిపించేది. ఈ విషయాన్ని గుర్తించిన పవన్ గడిచిన ఏడాదిగా ఎక్కువగా ఏపీలోనే ఉంటున్న పరిస్థితి. తన నివాసాన్ని అమరావతి వద్ద ఏర్పాటు చేసుకోవటం తెలిసిందే.
నాడు పవన్ కు ఎదురైన విమర్శలే, నేడు జగన్ విషయంలోనూ చోటు చేసుకోవటంతో అలెర్ట్ అయిన వైసిపి నేతలు అధినేతను అర్జెంట్ గా పులివెందులకు వెళ్లాలన్న మాట చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంతోనే జగన్ హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. సరిగ్గా పరిశీలిస్తే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో నివాసంగా ఉండటం తప్పేమి కాదు. ఇప్పుడు పవన్ జగన్ లకు ఏపి రాజధాని ప్రాంతంలో స్వంత గృహాలు ఉన్నాయి.
అయితే అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి లో పడ్డట్టు - చంద్రబాబుకు అమరావతిలో ఒక అక్రమనిర్మాణంగా ఉన్న అద్దె ఇంట్లో ఉంటున్నారు. సర్వసంపదలు గృహ సముదాయాలు అంతా హైదరాబాద్ లోనే కలిగి ఉన్న, ఆయన, ఆయన కుటుంబ సభ్యులు అందరిని వేలెత్తి చూపుతారు. అయినా ఈ మాటతో ఉమ్మడి రాజధానిపై ఏపి ప్రజల సర్వహక్కులూ పోగొట్టేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.