నర్సాపురం నుంచి జనసేన తరుపున నాగబాబు భరిలో దిగుతుండటంతో ఇప్పుడు ఈ పార్లమెంట్ స్థానం రసవత్తరంగా మారింది. ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల బల బలాలను చూద్దాము. టీడీపీ తరుఫున పోటీచేయాల్సిన రఘురామకృష్ణం రాజు చివరి నిమిషంలో వైసీపీలో చేరి ఆపార్టీ తరుఫున ఇదే నర్సాపురం నుంచి ఎంపీగా పోటీలో నిలబడ్డారు. దీంతో చంద్రబాబు మరింత వ్యూహాత్మకంగా అదే క్షత్రియవర్గానికి చెందిన ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజును అభ్యర్థిగా బరిలో దింపారు. కలవపూడి శివగా.. మంచి పేరు సంపాదించుకున్న ఈయన రఘురామకృష్ణం రాజుకు ధీటైన అభ్యర్థిగా కనపడుతున్నారు.. టీడీపీ అధికారంలో ఉండడంతో ఆపార్టీ కార్యకర్తలు నేతల బలంతో ఆశావాహంగా ఉన్నారు. టీడీపీ చంద్రబాబు సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ఆశిస్తున్నారు.
టీడీపీ టికెట్ ను కాదని.. ఈసారి వైసీపీ వేవ్ తో ఆ పార్టీలోకి జంప్ చేసిన రఘురామకృష్ణం రాజు ప్రస్తుతం నర్సాపురంలోనే బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. క్షత్రియవర్గంలో మంచి ఇమేజ్ పాపులారిటీ ఈయన సొంతం. బలమైన నేతగా.. కార్యకర్తలు నాయకుల బలం పుష్కలంగా ఉంది. ప్రజల సపోర్టు కూడా ఈయనే ఉంది. దీంతో టీడీపీ అభ్యర్థి శివరామరాజును ఈజీగా ఓడిస్తాడని వైసీపీ నమ్మకంగా ఉంది.
ఇక నాగబాబు గురించి చెప్పాలంటే నాగబాబు నాన్ లోకల్ కావటం మైనస్ గా చెప్పొచ్చు. అయితే మెగా ఫ్యామిలీ సొంతూరు మొగల్తూరు నర్సాపురం నియోజకవర్గంలో ఉండడంతో వీరికి అనుబంధం ఎక్కువగా ఉంది. కానీ కాపులందరూ నాగబాబుకు వేస్తారన్నది డౌటే. ఎందుకంటే హైదరాబాద్ లో ఉండి స్థానికతను పట్టించుకోని నాగబాబు సడన్ గా వచ్చి పోటీపడితే స్థానికేతరుడన్న కారణం ఆయనకు మైనస్ గా మారింది. ఇదివరకు ప్రజారాజ్యం అధ్యక్షుడిగా చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీపడితే ఓడిపోయారు. నాన్ లోకల్ అన్న ముద్ర నాగబాబుకు మైనస్ గా మారింది. దీంతో నాగబాబుకు గంపగుత్తగా కాపు ఓట్లు పడే చాన్సులు అయితే లేవు. ఇక కాపులు కాకుండా మిగతా వర్గాల ఓట్లు వైసీపీ టీడీపీకే పడే అవకాశాలున్నాయి. కాపులు కూడా ఇటువైపు తిరిగితే ఇద్దరూ బలమైన అభ్యర్థులుగా మిగులుతారు.