కామాతురానాం నభయం న లజ్జ..కామంతో కళ్లు మూసుకున్న వాడికి కంటికి చిన్నా పేద్దా తార తమ్యం తెలియదు..ఆడది కనిపిస్తే చాలు చిత్త కార్తె కుక్కలా రెచ్చిపోతుంటారు. సంఘంలో ఇలాంటి వారు ఈ మద్య గల్లీకొక్కడు తయారయ్యాడు. ప్రతిరోజూ మహిళలు, చిన్నారులు చివరికి వృద్దులపై సైతం కామాంధులు రెచ్చిపోతున్నారు. హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులతో ఇబ్బందులు పెడుతున్నారు.
తాజాగా ఓ దుర్మార్గుడు 15 ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు..ప్రేమ, పెళ్లి అంటూ వెంటపడి.. బలవంతంగా మెడలో తాళికట్టి.. బెదిరించి కాపురం చేశాడు. వివరాల్లోకి వెళితే..ఎమ్మిగనూరు పట్టణం గాంధీనగర్ కి చెందిన ఓ మహిళ 2015లో హెచ్ఐవీ తో కన్నుమూసింది. ఆమె కూతురు కి కూడా ఆ వ్యాది సోకిందని కొంత కాలం తర్వాత తెలిసిందే.
దాంతో ఆ బాలికను తండ్రి ఆదోనిలోని స్వచ్ఛంద సంస్థలో చేర్పించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స తీసుకుంటూ చదువుకుంటుంది. గత కొంత కాలంగా ఆ అమ్మాయికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తన తండ్రి వద్దకు వచ్చేసింది. అయితే ఆమె అనారోగ్యంగా ఉందని తెలిసి కూడా ఆ ఊరికే చెందిన శంకర్ అనే యువకుడు లైంగిక వేధింపులకు పాల్పపడ్డాడు.
అంతే కాదు తనకు హెచ్ఐవీ ఉందని బాలిక చెప్పినా వినకుండా బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకొని మూడు నెలల పాటు కాపురం చేశాడు. మూడు నెలలు అతని నరకాన్ని భరించిన ఆ బాలిక ఎలాగో అల తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు.