ఎస్వీయూ క్యాంపస్ లో అఫిలియేటెడ్ కాలేజీలలో చదువుకుంటున్న దాదాపు లక్షా ఇరవై వేల మంది విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఎస్వీయూ వ్యవహార శైలిని చూసి.


విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య బాధ్యత దేశానికి కావాలసిన మేథో సంపత్తిని తయారు చేయడం.  బడుగు, బలహీన, మద్య  అన్ని తరగతులకు చెందిన విద్యార్థులను ఉన్నత శిఖరాలనధిరోహించే విధంగా కార్యకలాపాలు నిర్వహించడం. 


విద్యార్థి ఫలానా కోర్సులో జాయినయ్యాడన్న దగ్గరి నుండి, ప్రొవిజినల్ సర్టిఫికెట్లనందించి విద్యార్థులు తమ కెరియర్ ను ప్రారంభించే విధంగా విశ్వవిద్యాలయం తన కార్యకలాపాలు నిర్వహించాలి.


లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలతో 65 ఏళ్ళ ఘనత వహించిన ఎస్వీయూ చెలగాటమాడుతుందంటున్నారు విద్యావేత్తలు..అఫిలియేటెడ్ కాలేజీల సర్టిఫికెషన్ నుండి అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాలు, సర్టిఫికెట్లు, నియామకాలు అన్నింటా మొత్తానికి లంచగొండి తనం..ఆశ్రిత పక్షపాతం వేనోళ్ళ పొతుకు పోయాయి ఎస్వీయూలో అంటున్నారు విద్యావంతులు.


ఒక కులానికి చెందినవారేమీ చేసినా ఒప్పు..మరెవరేంచేసినా తప్పు అన్నట్లుగా ఎస్వీయూ తయారవ్వడం వెనుకాల ఎస్వీయూ చరిత్రలోని అత్యంత వివాదాస్పద రిజిస్ట్రార్ గా జనాలు చెప్పుకుంటున్న ప్రస్తుతం రిజిస్ట్రార్ హస్తం ఉందని గుస గుసలాడుకుంటున్నారు జనాలు. మరి నిజం పెరుమాళ్ళకెరుక. 


మరింత సమాచారం తెలుసుకోండి: