మెజారిటీ ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ గెలుపు డిక్లేర్ చేసిన నియోకవర్గం మాత్రం చింతలపూడి నియోజకవర్గమే. పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడిలో వైసిపి అభ్యర్ది ఎలీజా 31400 ఓట్లతో టిడిపి అభ్యర్ధిపై విజయం సాధించారు. టిడిపి తరపున కర్రా రాజారావు పోటీ చేశారు.

 

రెండు ప్రధాన పార్టీల తరపున పోటీ చేసిన అభ్యర్దులు ఇద్దరూ ప్రత్యక్ష ఎన్నికలకు కొత్తే కావటం గమనార్హం. మాజీ మంత్రి పీతల సుజాతకు వ్యతిరేకంగా ఎంపి అభ్యర్ధి మాగంటి బాబుతో పాటు కొందరు స్ధానిక నేతలు పావులు కదిపి కర్రా రాజారావుకు టికెట్ ఇప్పించారు. దాంతో సుజాత వర్గం మొత్తం టిడిపికి వ్యతిరేకంగా పనిచేసిందని సమాచారం.

 

అదే సమయంలో వైసిపి అభ్యర్ధి ఎలీజా పట్టుమీద వర్కవుట్ చేసుకున్నారు. అభ్యర్ధిపై వైసిపిలో ఎక్కడా వ్యతిరేకత లేకపోవటంతో నేతలందరూ కలిసి కట్టుగా పనిచేశారు.  అదే సమయంలో ఎంపి అభ్యర్ధి, ఎంఎల్ఏ అభ్యర్ధులకు మంచి సమన్వయం కుదరటంతో వైసిపి అభ్యర్ధి గెలుపు తేలికైంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: