అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే జగన్ తన మార్కు చూపుతున్నాడు. కేవలం మూడు రోజుల్లోనే పలు సంచలన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతున్నారు. మే 30న ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఆ తర్వాత మూడు రోజుల్లో అనేక కీలక అడుగులు వేశారు. అవేంటో చూద్దాం.. 
వృద్ధుల పెన్షన్ 2000 నుండి 2250 కి పెంచారు. వికలాంగుల పెన్షన్ 2000 నుండి 3000 కి పెంచారు. కిడ్నీ రోగులకు పెన్షన్ 3500 నుండి 10,000 కు పెంచారు. మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం 1000 నుండి 3000 లకు పెంచారు. 

 

44,000 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో ఒత్తిడిలేని విద్య కోసం ప్రతి శనివారం No Bag Day అమలు చేయాలని ఆదేశించారు. మూసివేయబడిన అన్ని ప్రభుత్వ పాఠశాలలు తెరిపించాలని నిర్ణయించారు. 


YSR అక్షయపాత్ర పథకం ద్వారా బడిపిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలని నిర్ణయించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్లాన్ రెడి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రంజాన్ సందర్భంగా 13 జిల్లాలోని మసీదులకు మరమ్మత్తులు,పెయింట్ ఖర్చుల నిమిత్తం 4 కోట్లు విడుదల చేశారు. 


రంజాన్ పండుగ సందర్భంగా 13 జిల్లాల్లో ఇఫ్తార్ విందు ఖర్చుల నిమిత్తం జిల్లాకు 5 లక్షల చొప్పున 55 లక్షల విడుదల చేశారు. ప్రమాణ స్వీకారం ఖర్చును 15 లక్షల్లోనే ముగించేశారు. నెలకు ఒక్క రూపాయి జీతం తీసుకునే పని చేస్తానని జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇకపై అతి ఖరీదైన హిమాలయ వాటర్ బాటిల్స్ వంటి ఖరీదైన బ్లాండ్లు నిషేధించి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఆదేశించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: