జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం బాగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. స్పీకర్ స్ధానంలో కూర్చున్న వ్యక్తి అసెంబ్లీని నిష్పక్షపాతంగా నడపాలి. అప్పుడే అధికార, ప్రతిపక్షాల మన్ననలు అందుకుంటారు.  కానీ ఐదేళ్ళ పాటు స్పీకర్ గా చేసిన కోడెల శివప్రసాద రావు  అందుకు విరుద్ధంగా నడిపారు. అసెంబ్లీని  ఎలా నడపకూడదో అలా నడిపి అప్రదిష్ట మూటగట్టుకున్నారు.

 

స్పీకర్ కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా కోడెల తాను టిడిపి నేతగానే పనిచేశారు. ప్రతీ విషయంలోను అధికార పార్టీకి పూర్తి మద్దతు పలకటం ద్వారా అసెంబ్లీ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చేశారు. ఫలితంగా కొత్త స్పీకర్ గా  తమ్మినేని సీతారమ్ ఎన్నికైన సందర్భంలో టిడిపి నేతలు కూడా కోడెల పదవీ కాలాన్ని గుర్తు చేసేందుకు సాహసించ లేదు.

 

మామూలుగా అయితే గతంలో స్పీకర్లుగా  పనిచేసిన వారు సభను నడిపిన విధానాన్ని గుర్తు చేసుకోవటం సహజం.  కొత్త స్పీకర్ తమ్మినేని గురించి మాట్లాడుతూ వైసిపి వాళ్ళేమో కోడెల లాగ వ్యవహరించవద్దని నేరుగానే చెప్పారు. మరి వైసిపి నేతల ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాల్సిన టిడిపి సభ్యులు కూడా కోడెలను సమర్ధిస్తు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

ఏకపక్షంగా పనిచేస్తే ఎంతటి అప్రదిష్ట మూట గట్టుకుంటారో కోడెల వ్యవహార శైలే నిదర్శనం. విచిత్రమేమిటంటే స్పీకర్ స్ధానంలో ఉండి కూడా టిడిపి కార్యకర్త లాగ పనిచేసిన కోడెలకు ఇపుడు టిడిపి నేతలు కూడా మద్దతుగా మాట్లాడకపోవటం. పదవిలో ఉన్నపుడు కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మి పూర్తిగా బరితెగించేశారు.

 

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళిద్దరూ చేయని అరాచకం లేదు. ఇపుడు వాళ్ళపై కేసులు పెట్టటానికి బాధితులు క్యూ కడుతున్నారు. ఫలితంగా కొడుకు, కూతురు పోలీసుల నుండి తప్పించుకునేందుకు పరారీలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా కోడెలపై అయ్యోపాపం అనే టిడిపి నేతలే కరువయ్యారు. కాబట్టి కొత్త స్పీకర్ గా ఎన్నికైన తమ్మినేని అయినా కోడెల లాగ కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించి అందరి మన్ననులు అందుకుంటారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: