తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మెయిన్‌రోడ్‌లోని శర్వానీ సూపర్‌ మార్కెట్‌లో బుధవారం వేకువజామున 4గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతం కారణంగా చెలరేగిన మంటలు భవనంలోని మూడు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.2 కోట్ల వరకూ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఎనిమిది అగ్నిమాపక శకటాలతో మంటలు అదపు చేశారు. మంటల తీవ్రత భారీగా ఉండటంతో పెద్దాపురం, పిఠాపురం నుంచి నాలుగు అగ్నిమాపక శకటాలను తరలించినట్లు అధికారులు వెల్లడించారు. భవనం ఇరుకు ప్రాంతంలో ఉండడం వల్ల చుట్టు పక్కలకు వెళ్లే వీలు లేకుండా పోయింది, దీంతో కొంత భాగం గోడలను పగులగొట్టి మంటలు అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు ఏడుగంటల పాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అగ్నికీలలకు భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ భవనానికి ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేవని అధికారులు  తెలిపారు. సూపర్‌ మార్కెట్‌లో ప్లాస్టిక్‌ వస్తులు, స్కూల్‌ బ్యాగులు, దుస్తులు ఉండడంతో మంటల తీవ్రత బాగా పెరిగిందని అధికారులు అంచనా వేశారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కాణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి రత్నబాబు తెలిపారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: