చెప్పండి తమ్ముళ్లూ.. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలట.. ఎందుకు ఇవ్వాలి తమ్ముళ్లూ.. ఆయనకు ఏం అనుభవం ఉందని.. అనుభవం లేని ఇలాంటి నాయకుడి చేతుల్లో రాష్ట్ర భవిష్యత్ పెడతామా చెప్పండి.. ఇవీ.. ఎన్నికల సమయలో అప్పటి సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు.. 


కానీ ఏపీ జనం మాత్రం ఆ మాటలను పట్టించుకోలేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు. ఇచ్చేశారు. ఇప్పుడు అదే అనుభవం లేని జగన్.. ఏపీ సీఎంగా తక్కువ కాలంలోనే అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఎలాంటి శషభిషలు లేకుండానే.. చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. 

జగన్ దూకుడు, అవగాహన, ఓ అంశంపై వివరాలు తెలుసుకునే విధానం, వేసే ప్రశ్నల పరంపర చూసి ఐఏఎస్ అధికారులు నోళ్లు వెళ్లబెడుతున్నారట. ఈయన ముఖ్యమంత్రా లేక.. ఐఏఎస్ ఆఫీసరా అని ఆశ్చర్యపోతున్నారట. జగన్ తో కలసి పనిచేస్తుంటే.. ఓ ముఖ్యమంత్రితో కలసి పని చేస్తున్నట్టు లేదంటున్నారు ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్.. 

జగన్ తో పని చేస్తుంటే ఓ పొలిటీషియన్ తో కలసి చేస్తున్నట్టు కాకుండా.. ఓ ఐఏఎస్ అధికారితో కలసి పని చేస్తున్నట్టు అనిపిస్తోందని ఆ సీనియర్ ఐఏఎస్ కామెంట్ చేశారట. జగన్ పని తీరు ఐఏఎస్ అధికారులను అంతగా ఆకట్టుకుంటోదట. 


మరింత సమాచారం తెలుసుకోండి: