తెలుగుదేశంపార్టీ నేతల ఆదాయానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద గండికొట్టారు. రాష్ట్రంలోని బెల్ట్ షాపులను ఏరేయాలన్న ఆదేశాలతో చాలామంది తమ్ముళ్ళ ఆదాయానికి పెద్ద బొక్క పడినట్లే అనుకోవాలి. 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రచారం చేస్తు రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేకుండా చేస్తానంటూ బ్రహ్మాండమైన హామీనిచ్చారు. తీరా చూస్తే ఆ హామీని 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమలు చేయబోతున్నారు. అక్టోబర్ 1 వ తేదీకి రాష్ట్రంలో బెల్ట్ షాపులన్నవే కనబడకూడదని జగన్  కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించటం గమనార్హం.  హామీల అమలులో ఇద్దరి నేతల మధ్య ఉన్న వ్యత్యాసానికి ఇదొక తాజా ఉదాహరణ మాత్రమే.

రాష్ట్రంలో బెల్ట్ షాపులు వేలల్లో ఉన్న విషయం అందిరికీ తెలిసిందే. అధికారికంగా వైన్ షాపులు ఓ ఊరిలో రెండో మూడో ఉంటే బెల్ట్ షాపులు మాత్రం కనీసం ఓ పదుంటాయి. వైన్ షాపులైనా, బెల్ట్ షాపులైనా దాదాపు టిడిపి నేతల కనుసన్నల్లోనే నడుస్తున్న విషయం బహిరంగ రహస్యం.

 

అటువంటి బెల్ట్ షాపులను ఏరేస్తానంటూ చంద్రబాబు భీకర శపథమే చేశారు. అధికారంలోకి వస్తే తాను పెట్టబోయే మొదటి సంతకాల్లో కూడా ఇది కూడా ఒకటని ప్రకటించారు. తీరా చూస్తే సంతకాలైతే పెట్టారు కానీ బెల్ట్ షాపుల నియంత్రణ మాత్రం కాలేదు. పైగా మరింత పెరిగిపోయాయి. అవన్నీ టిడిపి నేతలవే కావటంతో యంత్రాంగం కూడా ఏమీ చేయలేక వదిలేసింది.

 

సరే మొన్నటి ఎన్నికల్లో జనాలు టిడిపి గూబగుయ్యిమనిపించారు కద ? దాంతో అధికారంలోకి వచ్చిన జగన్ వివిధ అంశాలపై సమీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బెల్ట్ షాపుల అంశంపై కూడా చర్చించారు. బెల్ట్ షాపులను వెంటనే ఏరేయాలంటూ జగన్ ఆదేశించారు.

 

ఏ ఊరిలో కూడా బెల్ట్ షాపన్నదే కనబడకూడదంటూ ఎక్సైజ్ శాఖకు పూర్తి అధికారాలను ఇచ్చారు. అలాగే హై వేల పక్కనే మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వద్దన్నారు. దాబాల్లో మద్యం విక్రయాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారు ఏ పార్టీ వారైనా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించటం గమనార్హం. మొత్తం మీద చంద్రబాబు ఇచ్చిన హామీని జగన్ అమలు చేస్తుండటమే కొసమెరుపు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: