తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంపై తనదైన ముద్ర కోసం తపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించి ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఖ్యాతి గడించారు. ఇప్పుడు ఘనమైన నిర్మాణాల ద్వారా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు.
బహుశా అందుకోసమే నేమో.. తెలంగాణలో అసెంబ్లీ, సెక్రటేరియట్ రెండు బాగానే ఉన్నా.. దాదాపు 500 కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త భవనాల నిర్మాణం కోసం తపిస్తున్నారు. ఇప్పటికే సెక్రటేరియట్ , అసెంబ్లీ భవనాల కోసం ఆయన శంకుస్థాపన చేశారు.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వీటితో పాటుగా.. ఇదే సమయంలో తన వ్యవసాయ క్షేత్రంలో మరో శంకుస్థాపన కూడా చేశారు. ఎందుకంటారా... ఫామ్ హౌస్ లో ప్రస్తుతం ఉన్న భవనం అనుకూలంగా లేదని... ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా మరో పెద్ద భవనం నిర్మించాలని భావించారు.
జ్యోతిష్యానికి పెద్దపీట వేసే కేసీఆర్.. సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన వేసిన ఆ ముహూర్తాల ని.. కాస్త అటు ఇటుగా వ్యవసాయ క్షేత్రంలోని భవనానికి ఉపయోగించారు. త్వరలోనే కెసిఆర్ ఫాం హౌస్ లో కొత్త భవనం రూపుదిద్దుకోబోతోంది అన్నమాట.