జనసేన, తెలుగుదేశంపార్టీ
ఎంఎల్ఏల విషయంలో జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ కమిటిల ఛైర్మన్ల
విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేదు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష ఎంఎల్ఏలే
నమ్మలేకపోతున్నారని సమాచారం.
ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటిలు చాలానే ఉన్నాయి. ఆ కమిటిలకు ప్రభుత్వం ఛైర్మన్లను నియమించబోతోంది. ఈ విషయంలో జగన్ ఓ నిర్ణయం తీసుకున్నారట. ఏ నియోజకవర్గంలో ఉన్న మార్కెట్ కమిటికి ఆ ఎంఎల్ఏనే ఛైర్మన్ గా నియమించేందుకు జగన్ నిర్ణయించినట్లు సమాచారం.
మామూలుగా అయితే జగన్ చేసిన పనిని ఏ ముఖ్యమంత్రి కూడా చేయరన్న విషయం అందరికీ తెలుసు. అంతెందుకు మొన్నటి దాకా అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు ఏమి చేసింది అందరూ చూసిందే. వైసిపి ఎంఎల్ఏలను కనీసం గుర్తించటానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు.
అలాంటిది ఇపుడు జగన్ తీసుకున్న నిర్ణయం నిజంగానే సంచలనంగా మారింది. కాకపోతే జగన్ నిర్ణయంపై పార్టీలోనే వ్యతిరేకత వస్తోందట. ప్రతిపక్ష ఎంఎల్ఏలున్న నియోజకవర్గాల్లో పార్టీ సీనియర్లను ఛైర్మన్లుగా నియమించ వచ్చని ఒత్తిడి పెడుతున్నారట. మరి జగన్ నిర్ణయమే ఫైనల్ అవుతుందో లేకపోతే నేతల ఒత్తిళ్ళకు జగన్ లొంగిపోతారో చూడాల్సిందే.