కరకట్టపై నిర్మించిన అక్రమ
నివాసం లింగమనేని గెస్ట్ హౌస్ ను ఖాళీ చేయటానికి చంద్రబాబునాయుడు ఇష్టపడటం లేదు.
అక్రమనిర్మాణాన్ని కూల్చేసేందుకు ప్రభుత్వం 26 మంది భవనాల యజమానులకు నోటీసులు కూడా
ఇచ్చింది. అయినా సరే తానుంటున్న అక్రమ కట్టడం నుండి ఖాళీ చేయటానకి చంద్రబాబు
మాత్రం ఇష్టపడటం లేదు.
తాను ఖాళీ చేయకపోగా మీ ఇష్టం వచ్చింది చేసుకోండని సవాలు విసురుతున్నారు. పైగా జనాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చ గొడుతున్నారు. అసెంబ్లీలో కరకట్ట మీద అక్రమనిర్మాణాలపై జరిగిన చర్చలో మాట్లాడుతూ తాను అక్రమంగా ఎక్కడా ఇల్లు కట్టలేదని, తాను ఇంటి స్ధలం కూడా అక్రమంగా తీసుకోలేదని అడ్డుగోలు వాదన వినిపిస్తున్నారు.
తానుంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను చంద్రబాబు కట్టకపోయుండచ్చు. కానీ లింగమనేని కట్టిన అక్రమ నిర్మాణంలో ఉంటూ కూడా ఇంకా బుకాయిస్తున్నారంటే చంద్రబాబును ఏమనాలో అర్ధం కావటం లేదు. పైగా తానుంటున్న ఇంటిని ఏమి చేసుకుంటారో చేసుకోండని రెచ్చ గొడుతున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే నడిరోడ్డు మీద పడుకోవటానికి కూడా సిద్ధమేనంటూ కథలు చెబుతున్నారు.
కరకట్ట మీద అక్రమ కట్టడాలను కూల్చేయటానికి సామాన్య జనాలకు ఏమి సంబంధమో అర్ధం కావటం లేదు. అధికారంలో ఉన్నపుడు నంద్యాల లాంటి పట్టణాల్లో పేదల ఇళ్ళను కూల్చేసిన చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కారానికి నడిరోడ్డు మీదే పడుకుంటానని డ్రామా డైలాగులు చెప్పటమే విచిత్రంగా ఉంది.