ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ అప్పుడే దూకుడు ప్రారంభించింది. మొదట్లో ఆరు నెలులు వెయిట్ చేసి అప్పుడు ఎదురుదాడికి దిగాలని ముందుగా భావించినా.. సీఎం జగన్ కూడా దూకుడుగా వెళ్తుండటంతో స్టాండ్ మార్చుకుంది. వీలైనంతవరకూ అధికారపక్షాన్ని ఎండగట్టేందుకు ప్రయత్నిస్తోంది.


ఈ సమయంలో కొన్ని జగన్ వీడియోలు టీడీపీకి ఆయుధాలుగా మారుతున్నాయి. సోషల్ మీడియా వచ్చాక వీడియోలకు ప్రాధాన్యం బాగా పెరిగింది. ఇవి సులభంగా షేర్ అవుతూ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి.


మొన్నటికి మొన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 ఏళ్లకే పించన్ ఇస్తానని 2017లో జగన్ చెప్పిన వీడియోను టీడీపీ అస్త్రంగా మలచుకుని రెండు రోజులు అసెంబ్లీని స్తంభింపజేసింది. వాస్తవానికి ఆ వీడియో తర్వాత వైసీపీ స్టాండ్ మార్చుకుని వైఎస్సార్ ఆసరాను ప్రకటించింది. మానిఫెస్టోలోనూ అదే ఉంచింది.


ఇక ఇప్పుడు జగన్.. జలదీక్ష సందర్భంగా కేసీఆర్ హిట్లర్ మాదిరి వ్యవహరిస్తున్నారని జగన్ చేసిన ప్రసంగాన్ని ఆయుధంగా టీడీపీ మలచుకుంటోంది. దీనికి తాజాగా జగన్ అసెంబ్లీలో కేసీఆర్ మంచివాడని పొగిడిన వీడియో జత చేసి.. సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఈ వాదనలను వైసీపీ సమర్థంగా ఎదుర్కొనలేకపోతే... ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: