ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక.. చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. కరకట్టపైనున్న ప్రజావేదిక కూల్చివేత.. అసెంబ్లీలో చంద్రబాబుపై విమర్శలు వంటి అంశాలు ఇందుకు కారణం అవుతున్నాయి. చంద్రబాబుకు బుద్ది, జ్ఞానం ఉన్నాయా అంటూ జగన్ నేరుగా ప్రశ్నించడం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.


ఇప్పుడు ఈ అంశాలను తనకు అనుకూలంగా మలచుకునేందుకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ పొలిటిషీయన్ చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. తనపై వస్తున్న సానుభూతిని జగన్ వ్యతిరేకతగా మలిచి ప్రయత్నాలు చేస్తున్నారు. ధర్నాలు, నిరసనలు, వాకౌట్లతో సీన్ మార్చేందుకు తన వంతుగా ప్రయత్నిస్తున్నారు.


తమ పార్టీ సభ్యులకు స్పీకర్ సరైన అవకాశాలు ఇవ్వడం లేదని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. సభను నడిపిస్తున్నది స్పీకరా?ముఖ్యమంత్రా అని ప్రశ్నించారు. సభలో పాలకపక్షం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, తనను తిట్టించేందుకే అధికార పార్టీ సభ్యులకు మైక్ ఇస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులపై ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా దాడులు చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. మరి చంద్రబాబు సానూభూతిరాజకీయాలు వర్కవుట్ అవుతాయా.. జనం ఈ వాదనతో ఎంతవరకూ కనెక్ట్ అవుతారు.. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: