కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మృతి పట్ల పలువురు ప్రముక నేతలు, నాయకులూ సంతాపం తెలియచేస్తున్నారు. 1969లో రాజకీయాలలో అడుగు పెట్టిన జైపాల్ రెడ్డి ఐదుసార్లు ఎంపీగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేశారు. గత కొద్ది రోజులుగా నిమోనియాతో బాధపడుతున్న జైపాల్ రెడ్డి ఈరోజు తెల్లవారుజామున ఉదయం 1:30 నిమిషాలకు మృతిచెందారు.
జైపాల్ రెడ్డి మృతి పట్ల దేశవ్యాప్తంగా పలువురు నేతలు సంతాపం తెలియచేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాహుల్ గాంధీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ జైపాల్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు.
ఉత్తమ కుమార్ రెడ్డి ..
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఓ మంచి నాయకుడిని కోల్పోయామని ఆయన తెలిపారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జైపాల్ రెడ్డి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు.
కేసిఆర్ ..
కేంద్ర మాజీ మంత్రి శ్రీ జైపాల్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కేటీఆర్ ..
కేంద్ర మాజీ మంత్రి శ్రీ జైపాల్ రెడ్డి మరణం తీరని లోటు. అయన కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతి అని తెలిపారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.
చంద్రబాబు నాయుడు..
కేంద్రమాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మృతిపట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
నారా లోకేష్ ..
క్రమశిక్షణ కలిగిన ఆదర్శవాదిగా, సీనియర్ రాజకీయవేత్తగా తెలుగువారి తరపున దేశ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన జైపాల్‌రెడ్డిగారి మరణం తెలుగువారికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ నారా లోకేష్ ట్విట్ చేశారు. కాగా జైపాల్ రెడ్డి గారి అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం నెక్లెస్‌రోడ్‌లో నిర్వహించనున్నారు.