అధికారంలోకి రావటానికి తప్పుడు హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారు. తీరా అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత ఇపుడు కాపులకు రాజర్వేషన్ అమలు కోసం ఉద్యమాలు చేస్తారట...ఇది టిడిపి నేతల వరస. అధికారంలోకి రావాలన్నా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కాపులను మోసం చేయటమే టిడిపి లక్ష్యంగా కనబడుతోంది. చంద్రబాబు అమెరికా నుండి రాగానే కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేస్తామని జ్యోతుల నెహ్రు ప్రకటించటమే క్యామిడీగా ఉంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే 2014 ఎన్నికల్లో కాపులను బిసిల్లో చేరుస్తానని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత తన హామీని తుంగలో తొక్కేశారు. సరే తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే. మొక్కుబడిగా కాపులకు బిసిల రిజర్వేషన్ వర్తింపచేయాలంటూ సంతకంలేని బిసి కమీషన్ ఛైర్మన్ మంజూనాధ రిపోర్టును అసెంబ్లీలో పెట్టారు.  బిల్లును సభలో పాస్ చేయించుకుని కేంద్రానికి పంపి చేతులు దులిపేసుకున్నారు. సరే కేంద్రం దాన్ని తిప్పికొంట్టిందనుకోండి అది వేరే సంగతి.

 

ఆ తర్వాత కొంత కాలానికి ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాల్లో  పేదలకు 10 రిజర్వేషన్ కల్పిస్తు నిర్ణయం తీసుకుంది. వెంటనే ఆ 10 శాతంలో 5 శాతం కాపులకు కేటాయిస్తు చంద్రబాబు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నిజానికి రిజర్వేషన్ల అంశం కేంద్రప్రభుత్వం పరిధిలోనిది. ఆ విషయం చంద్రబాబు బాగా తెలుసు. తెలిసినా హామీలిచ్చారంటే జనాలను మోసం చేయటమే.

 

అలా అధికారంలో ఉన్నంత కాలం కాపులను మభ్యపెడుతూ, మోసం చేసిన చంద్రబాబు చివరకు అదే కాపుల ఆగ్రహనికి గురై ప్రతిపక్షంలో కూర్చున్నారు. అలాంటిది చంద్రబాబు కాపులకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్లు వెంటనే ఆమలు చేయాలని టిడిపి డిమాండ్ చేయటం విచిత్రంగా ఉంది. పైగా కాపుల రిజర్వేషన్ కు అనుకూలంగా కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యత జగన్ పై ఉందని చెప్పటం మరీ విడ్డూరం. చూస్తుంటే జనాలను మోసం చేయటమే ధ్యేయంగా టిడిపి పనిచేస్తోందని అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: