అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశంపార్టీ శాసనసభ్యులు అసలు నోరే ఎత్తటం లేదు. చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన ప్రభావం సమావేశాల్లో స్పష్టంగా కనబడుతోంది. మొన్నటి వరకూ అవసరం ఉన్నా లేకపోయినా సభలో టిడిపి సభ్యులు నానా రాద్ధాంతం చేసిన విషయం అందరకీ తెలిసిందే.

 

గడచిన ఐదేళ్ళలో చేసిన కంపుపై అసెంబ్లీలో వైసిపి సభ్యులు చంద్రబాబునాయుడును ఉతికి ఆరేశారు. దాంతో వాళ్ళకు అసెంబ్లీలో సమాధానం చెప్పుకోలేక తమ సభ్యులతో నానా రకాలుగా గొడవలు చేయించేవాడు చంద్రబాబు. పార్టీ అధ్యక్షుడు, టిడిఎల్పీ అధ్యక్షుడు కూడా కావటంతో ఇష్టం ఉన్నా లేకపోయినా చంద్రబాబు చెప్పాడని ఎంఎల్ఏలు రెచ్చిపోయేవారు. దాంతో సభ మొత్తం గందరగోళంగానే సాగింది.

 

ఎప్పుడైతే ఒకటికి రెండుమూడు సార్లు చెప్పినా మాట వినలేదో వేరే దారిలేక స్పీకర్ అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను సెషన్ మొత్తానికి సభ నుండి సస్పెండ్ చేశారు. దాంతో కొంత వరకూ గోల తగ్గింది. అయినా మిగిలిన వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా గోల చేస్తూనే  ఉన్నారు. మూడు రోజుల క్రితం మరో నలుగురు ఎంఎల్ఏలను కూడా స్పీకర్ సస్పెండ్ చేశారు.

 

అదే సమయంలో చంద్రబాబు కూడా అమెరికా పర్యటనకు వెళ్ళారు. అప్పుడు ఇపుడు కూడా సభలో చంద్రబాబును వైసిపి టార్గెట్ చేస్తూనే ఉంది. అయినా అసెంబ్లీలో టిడిపి ఎంఎల్ఏలు ఎవరూ నోరెత్తటం లేదు. అంటే ఇంతకుముందు చేసిన గోలంతా కేవలం చంద్రబాబు ఆదేశాల ప్రకారమే జరిగిందని అర్ధమవుతోంది.

 

 

అసెంబ్లీలో టిడిపి ఎంఎల్ఏలు ప్రశ్నోత్తరాలకు సంబంధించిన ప్రశ్నలు వేయటం, మంత్రుల సమాధానాలపై మాట్లాడటం తప్పించి ఇతరత్రా అంశాలేవీ మాట్లాడటం లేదు. ఈరోజు అసెంబ్లీలో ఫైబర్ గ్రిడ్ లో జరిగిన అవినీతిపై వైసిపి సభ్యులు చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలే చేశారు. అయినా టిడిపి నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా నోరెత్తకపోవటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: