వయస్సు పైబడుతున్నా సీనియర్ హీరో నాగార్జున కుర్రాళ్లతో పోటీపడుతున్నాడు.. తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు. ఇందుకు తాజాగా విడుదలైన బిగ్ బాస్ రేటింగ్ చార్టులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున కూడా ఎన్టీఆర్, నానిలను మించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడని తెలుస్తోంది.
ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ తొలి సీజన్ తొలి ఎపిసోడ్‌కు 16.18 రేటింగ్ వచ్చింది. అదే బిగ్ బాస్ 2 సీజన్ లో నాని హోస్ట్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్‌కు 15.05 రేటింగ్ వచ్చింది. వీళ్లిద్దరూ కుర్ర హీరోలే.. కానీ ఇప్పుడు వీళ్లిద్దరినీ వెనక్కి నెట్టిన నాగ్ తొలి ఎపిసోడ్‌కు 17.92 రేటింగ్ సాధించి టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లాడు..
ఇలాంటి షోలను రక్తి కట్టించడం, యాంకరింగ్ చేయడం నాగ్ కు వెన్నతో పెట్టిన విద్య. గతంలోనూ మీలో ఎవరు కోటీశ్వరుడు షోను బాగా హిట్ చేశాడు నాగ్. కానీ అదే షోలో చిరంజీవి తేలిపోయాడు. ఇక ఇప్పుడు బిగ్‌బాస్‌కు సంబంధించిన ప్రతీ వార్త మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నో వివాదాలకూ కారణమవుతున్న ఈ గేమ్ షో టీఆర్పీల విషయంలోనూ సంచలనాలు నమోదు చేస్తోంది.
జూలై 21న ప్రారంభమైన ఈ బిగ్ బాస్ షోలో ఇప్పటికే హేమ ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్‌ను ఇతర కార్యక్రమాలతో కన్నా ఎక్కువగా గత సీజన్లతో పోల్చి చూస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా వచ్చిన టీఆర్పీలను చూస్తే మూడో సీజన్ గత సీజన్ల కన్నా ఎక్కువగా ప్రజాదరణ పొందుతోంది. మొత్తానికి బిగ్ బాస్ 3తో పాటు మన్మథుడు 2 సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న నాగార్జున బుల్లి తెర మీద తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్నాడుగా.