రాష్ట్రంలో కొలువుదీరిన జగన్‌ ప్రభుత్వం రెండు నెలల వ్యవధిలోనే సంచలన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇప్పటి వరకు సంక్షేమంపై దృష్టి పెట్టి జగన్‌.. అనేక పథకాలతో ప్రజలను మెప్పించారు. పింఛన్ల పెంపు, నిరుద్యోగులపై నియామకాల వరదను పారించారు. అదేసమయంలో అమ్మ ఒడితో తల్లులకు ఉపశమనం కలిగించారు. ఇలా ప్రతి విషయంలోనూ ఆయన దూకుడు ప్రదర్శించారు. ఇక, ఇప్పుడు అభివృద్ధిమంత్రంతో ముందుకు సాగుతున్నారు. విభజన తర్వాత ఏపీ ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. 


ఈ ఇబ్బందులను అధిగమించి అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాల సరసన ఏపీని నిలబెట్టేందుకు జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే.. చాలా తొందరగానే జగన్‌ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం ప్రారంభించారు. దీనిలో భాగంగా ముఖ్యంగా విదేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానించేందుకు పెద్ద కసరత్తే ప్రారంభించారు. దీనిలో తాను ఒంటరిగా కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వెంటబెట్టుకుని ముందుకు సాగుతుండడం చాలా వ్యూహా త్మకంగా జగన్‌ అడుగులు వేస్తున్నారనడానికి పెద్ద నిదర్శనమని అంటున్నారు పరిశీలకులు.


ప్ర‌స్తుతం విజయ వాడ వేదిగా విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ఈ క్రమంలోనే కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున 35 పెద్ద, చిన్న దేశాలకు చెందిన దౌత్య వేత్తలు, రాయబారులతో విజయవాడలో రెండు రోజుల సదస్సును ఏర్పాటు చేశారు. అయితే, సాధారణంగా సదస్సు అంటే.. ఏపీలో ఉన్న అవకాశాలను వారికి వినిపించడం, వారిని ఆహ్వానిం చడం వరకే సరిపెడతారు. ఈ సందర్భంగా ఆయా దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన హామీలను ఇక, నిజమైపోయినట్టుగా గత ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. 


అయితే, ప్రస్తుత ప్రభుత్వాధినేత మాత్రం.. అలా కాకుండా ఇప్పుడు సదస్సుకు వచ్చిన దేశాలకు ప్రత్యేక వ్యాపార డెస్కులను రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుని, నిరంతరం వారితో టచ్‌లో ఉండేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు జగన్‌. దీనికి కేంద్రం కూడా సహకరిస్తుండడం గమనించాల్సిన విషయం. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు చేస్తున్న కృషికి పారిశ్రామిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: