ఏపీలో ఉన్న అధికార పార్టీ అయిన వైసీపీ ఎలాగైనా ఇరుకున పెట్టాలని .. అర్ధం ... పర్ధం లేని ఆరోపణలతో తప్పు చేసిన సమర్ధించుకోవటానికి వెనుకాడటం లేదు .. ఏపీలోని ప్రతి పక్ష పార్టీలు ఇటు జనసేన కావొచ్చు.. టీడీపీ కావొచ్చు.. రాపాక వ్యవహారాన్ని జనసేన ఉపయోగించుకొని జగన్ ను విమర్శించాలని ఆ పార్టీ అధినేత పవన్ కంకణం కట్టుకున్నంటున్నారు. దానికి పచ్చ బ్యాచ్ సపోర్ట్ చేయడం. వీరిద్దరు కలిసి రాష్ట్రంలో ప్రతి పక్షాల మీద దాడులు జారిపోతున్నాయని ప్రాజెక్ట్ చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానని .. కోట్ల ఆదాయాన్ని వదులుకొని మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని, పవన్ కళ్యాణ్ పదే, పదే చెబుతారు.
ఎన్నికలో తమ పార్టీ ఓడిపోవడానికి కారణం తాము డబ్బు పంచలేదని అందుకే ఓడిపోయాము అని కానీ నీతివంత మైన రాజకీయాలు చేస్తానని, పవన్ చెప్పారు. అయితే ఈ మధ్య పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే కేవలం మాటలు మాత్రమేనని ఆచరణ ఉండదని పవన్ నిరూపిస్తున్నారు. రాజకీయాల్లో తాను ఏ ఆశయంతో వచ్చానని చెప్పుకునే పవన్ దాన్నే తుంగలో తొక్కుతున్నారు.
అర్ధం .. పర్ధం లేని విమర్శలు చేసి తానూ కూడా ఒక సాధారణ రాజకీయనాయకుడేనని చెప్పకనే చెబుతున్నారు. అయితే జనసేన ఎమ్మెల్యే రాపాక తన అనుచరులైన పేకాట రాయుళ్లను కాపాడే క్రమంలో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన సంగతీ తెలిసిందే. ఈ విషయంలో రాపాక పలు విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇదే విషయంలో పవన్ కూడా కలుగజేసుకొని ఉన్న పరువును పోగొట్టుకుంటున్నారు. తన ఎమ్మెల్యేను కాపాడే క్రమంలో అధికార పార్టీ పై చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ నవ్వులుపాలు అవుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు పచ్చ బ్యాచ్ తోడు కావటం.