టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పేరు మార్చేసుకుంది...!! పీటీ ఉషగా కొత్త పేరు పెట్టుకుంది...!! ఔరా...ఇదేం చోద్యమని ముక్కున వేలేసుకుంటున్నారా...!! మీరే కాదు విశాఖలో చాలా మందికి ఇదే హాట్ టాపిక్. ఇంతకీ సానియాకు పీటీ ఉషగా నామకరణం చేసిన ఘనులు ఎవరో తెలుసా...!!. ఆంధ్రప్రదేశ్ క్రీడాశాఖ అధికారులు. 

ఈ హోర్డింగ్ చూసి ఫక్కున నవ్వుకునేరు....ఓకే...ఓకే....మీకు అర్ధమైంది అని....మాకూ అర్ధమైంది. ఇంకాస్త దగ్గరగా చూడండి. మరి కాస్త జాగ్రత్తగా పరిశీలించండి. ఎస్...ఇప్పుడీ సిత్రమే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అధికారుల అలసత్వంపై సెటైర్లు పేలుస్తోంది. ఇంతకీ ఈ ఘన కార్యం చేసింది ఎవరో తెలుసా...ఆంధ్రప్రదేశ్ క్రీడల శాఖ సిబ్బంది.  జాతీయ క్రీడల దినోత్సవాన్ని విశాఖ బీచ్ రోడ్డులో భారీగా నిర్వహించారు. 2కే వాక్ థాన్ లో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. క్రీడాదినోత్సవం కదా...యూత్ ను ఇన్ స్పైర్ చేద్దామని అధికారులు నిర్ణయించారు. ఇందు కోసం ప్రపంచ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన క్రీడాకారుల వివరాలతో కూడిన హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. వీటిపై ఫోటోలు....ప్రాతినిధ్యం వహించిన క్రీడలు... పొందిన అవార్డులతో కూడిన వివరాలు హోర్డింగ్స్ పై దర్శనమిచ్చాయి. ఆర్కే బీచ్ నుంచి ఆంధ్రాయూనివర్శిటీ కన్వెన్షన్ సెంటర్ దాకా .....స్ట్రీట్ లైట్ పోల్స్ కు వేలాడిన హోర్డింగ్స్ నిజంగానే విద్యార్ధుల్లో ఉత్సాహాన్ని నింపాయి. కానీ ఒక్కటంటే ఒక్కటే హోర్డింగ్ అక్కడికి వచ్చినోళ్ళకే కాదు నెటిజెన్లకు ఫుల్ టైంపాస్ గా మారింది.  

కురుసుర సబ్ మెరైన్ కు దగ్గర ఆ హోర్డింగ్ లో సానియా మీర్జా ఫోటో వుంది.  ఫోటో కింద తాటి కాయంత అక్షరాలతో టెన్నిస్ అని ఇంగ్లీషులో వుంది. బాగానే వుంది కదా ... మరి సోషల్ మీడియాలో గోలెందుకు అనుకుంటే...అక్కడే అసలు విషయం వుంది. సానియామీర్జా ఫోటో కింద పీటీ ఉష అని రాశారు.  సరే తప్పు ఏదో జరిగి వుంటుంది అనుకునే లోపే....ఇలా గమ్మత్తుగా ఉన్న ఈ హోర్డింగ్ సోషల్ మీడియా వైరల్ గా మారింది. ఈ హోర్డింగ్ ఫోటో సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరిగి...చివరకు క్రీడాశాఖకు కూడా చేరింది. దీంతో అప్పటికప్పుడు పరుగులు పెట్టి క్రీడాశాఖ అధికారులు హోర్డింగ్ తొలగించుకోవాల్సి వచ్చింది. ఫ్లెక్సీల ఏర్పాటులో పొరపాటు చేసిన ఇద్దరు కోచ్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు అధికారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: