మూడు నెలల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ టిడిపి నేతలే ఆందోళనలు చేస్తున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానాలు వస్తున్నాయి. తాజాగా ఇసుక కొరత పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చంద్రబాబునాయుడు పిలుపుతో తమ్ముళ్ళు రోడ్డెక్కారు.

 

నిజానికి ఇసుక అక్రమ అమ్మకాల్లో తమ్ముళ్ళు ఐదేళ్ళల్లో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. దాన్ని స్ట్రీమ్ లైన్ చేయటం కోసం అధికారంలోకి రాగానే జగన్ ఇసుక రీచ్ లపై బ్యాన్ పెట్టారు. హఠాత్తుగా బ్యాన్ పెట్టటంతో నిర్మాణాలు ఆగిపోయి ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమే. సెప్టెంబర్ 5వ తేదీ నుండి మళ్ళీ ఇసుక సరఫరాకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అయితే ఇసుకను జనాలందరికీ అందకుండా కృత్రియ కొరతను సృష్టించేందుకు చంద్రబాబు, లోకేష్ ప్లాన్ చేసిన విషయం బయటపడింది.

 

ఇక రాజధానిని తరలిస్తారనే విషయంలో రైతులు ఆందోళన చేశారు. నిజానికి వాళ్ళల్లో ఎక్కువమంది టిడిపి నేతలే. రైతుల ముసుగులో టిడిపి నేతలే అన్నీ పార్టీల అధినేతల దగ్గరకు వెళ్ళి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధానిని తరలించబోతున్నట్లు ప్రభుత్వం ఎక్కడా చెప్పకపోయినా కావాలనే టిడిపినే ఎల్లోమీడియా మద్దతుతో నానా రచ్చ చేసింది.

 

ఇక తిరుమలలో అన్యమత ప్రచారమంటూ టిడిపి గగ్గోలు మొదలుపెట్టిం. ఇక్కడ కూడా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నదంటూ నానా యాగీ చేసింది. ఇక్కడ మామూలు భక్తుల్లో చర్చ జరిగింది వాస్తవమే కానీ ఎవరూ ఆందోళన చేయలేదు. విషయం ఏమిటంటే అన్యమత ప్రచారం కోసం ప్రింట్ అయిన టిక్కెట్లన్నీ చంద్రబాబు హయాంలో ప్రింట్ అయినవే అని బయటపడగానే టిడిపి నేతల నోళ్ళన్నీ మూతపడిపోయాయి. చివరగా వైసిపి నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ చంద్రబాబు గోల పెట్టేస్తున్నారు. నిజానికి నమోదైన కేసుల్లో ఎక్కువగా కోర్టు ఆదేశాలతో పెట్టినవే. అధికారంలో ఉన్నపుడు చేసినట్లుగానే ఇపుడు కూడా ధౌర్జన్యాలు చేస్తుండటంతో బాధితులు కోర్టుకెక్కుతున్నారంతే.


మరింత సమాచారం తెలుసుకోండి: