మొన్నటి ఎన్నికల్లో జనాలు గూబ పగలగొట్టినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇంకా బుద్ధి రాలేదు. చంద్రబాబునాయుడు నీడలో నుండి పవన్ బయటపలేదని అర్ధమైపోతోంది. తాజాగా రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటించినపుడు జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణలే ఇందుకు నిదర్శనం. జగన్ ప్రభుత్వంపై చంద్రబాబునాయుడు ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారో అవే ఆరోపణలను పవన్ కూడా చేశారు.

 

పవన్ తాజా మాటలు చూస్తుంటే ఏ విషయంలో కూడా నిర్దిష్టమైన అభిప్రాయం కానీ సమాచారం కానీ ఉన్నట్లు అనిపించటం లేదు. రాజధాని తరలింపుపై పవన్ మాట్లాడుతూ అమరావతిని తరలిస్తే బలమైన నిర్ణయం తీసుకుంటానంటూ పెద్ద జోక్ పేల్చారు. రెండు రోజులు జనాల్లో తిరిగితే మళ్ళీ 20 రోజులు అడ్రస్ ఉండని పవన్ కూడా పెద్ద నిర్ణయాలు తీసుకుంటానని ప్రభుత్వాన్ని బెదిరించటమంటే జోక్ కాక మరేమిటి ?

 

ఇంతకీ విషయం ఏమిటంటే రాజధానిని మారుస్తున్నట్లు జగన్ ఎక్కడా చెప్పలేదు. పోనీ మంత్రులేమైనా చెప్పారా అంటే అదీ లేదు. రాజధాని ప్రాంతంలో సమస్యలను మంత్రి బొత్సా చెప్పగానే చంద్రబాబు, ఎల్లోమీడియా రచ్చ మొదలుపెట్టేశారు. దానికే పవన్ కూడా వంత పాడుతున్నారు. అవసరమైతే ఈ విషయాన్ని ప్రధానమంత్రితో కూడా మాట్లాడుతానని చెప్పటం మరీ విచిత్రంగా ఉంది.

 

ఇక ఇసుక కొరత గురించి కూడా టిడిపి చేస్తున్న ఆరోపణలనే పవన్ కూడా చేశారంతే. తర్వాత జగన్ ప్రభుత్వానికి 100 రోజులు గడువిద్దామని అనుకున్నారట. కానీ ఈలోగానే రోడ్డెక్కాల్సి వచ్చిందంటున్నారు. పనవ్ వరస చూస్తుంటే ఏ అంశం మీద కూడా స్పష్టత కానీ అవగాహన కానీ ఉన్నట్లు లేదు. చంద్రబాబు ఏమి చెప్పమంటే అదే చెప్పాలని మాత్రం తెలుసు. కాకపోతే తమ మధ్య బంధం జనాలకు తెలీకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో అక్కడక్కడ జగన్, చంద్రబాబు ఇద్దరిని కలిపి విమర్శించారంతే. పవన్ ఉద్దేశ్యాన్ని తెలుసుకోలేని అమాయకులు ఎవరూ లేరని ముందు జనసేనాని తెలుసుకుంటే మంచిది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: