ఇపుడిదే అనుమానం
అందరిలోను మొదలైంది. కాంట్రాక్టులు రద్దు చేసినందుకు నవయుగ సంస్ధ ప్రభుత్వానికి
వ్యతిరేకంగా న్యాయస్ధానాలను ఆశ్రయించింది. పోలవరం నిర్మాణ పనులతో పాటు హైడల్
ప్రాజెక్టు కాంట్రాక్టును కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే
బందరు పోర్టు పనుల కాంట్రాక్టును కూడా రద్దు చేసింది. పోలవరంతో పాటు పోర్టు పనులు రద్దయి 20 రోజులయ్యాయి.
హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుపై వెంటనే కోర్టును ఆశ్రయించిన నవయుగ కంపెనీ బందరు పోర్టు కాంట్రాక్టు రద్దు విషయంలో మాత్రం కోర్టుకు వెళ్ళటానికి ఇన్ని రోజులు ఎందుకు తీసుకుంది ? ఇక్కడే సంస్ధ యాజమాన్యం వైఖరిపై అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి. నవయుగ సంస్ధ యాజమాన్యానికి చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహిత సంబంధాలున్న విషయం అందరికీ తెలిసిందే.
పైగా మూడు పనులను నవయుగకు అప్పగిచ్చిందే చంద్రబాబు. హైడల్ ప్రాజెక్టు పనులతో పాటు పోర్టు పనులను కూడా సంస్ధ మొదలుపెట్టలేదు. అందుకనే జగన్ రద్దు చేశారు. పోర్టు పనులు ప్రారంభించటానికి ప్రభుత్వం తమకు భూమినే కేటాయించలేదని యాజమాన్యం ఇపుడు చెబుతోంది. మరి అదే నిజమైతే కాంట్రాక్టు దక్కించుకున్న దగ్గర నుండి యాజమాన్యం ఏమి చేస్తోంది ? భూమికోసం ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తేలేదు ?
జగన్ కాంట్రాక్టును రద్దు చేసిన తర్వాతే యాజమాన్యం ప్రభుత్వాన్ని తప్పుపడుతూ కోర్టులో కేసు వేయటమేంటి ? అంటే కేసుల వెనుక చంద్రబాబు ప్రోదల్బముందనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎలాగైనా జగన్ ను గబ్బు పట్టించాలంటే పనులు జరగకూడదు, కోర్టులో కేసులు ఫైనల్ కాకూడదు అన్నట్లుంది వ్యవహారం. ఒకసారి కోర్టులో కేసు పడితే ఎప్పటికి ఫైనల్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే భారీ ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో ఇబ్బందులుపడటం ఖాయమని అనుకోవాలి.