వీళ్ళంటే వీళ్ళు మాత్రమే
అని కాదు లేండి. ఇటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు తెలుగుదేశంపార్టీ కొంప
ముంచేయటానికి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గబ్బు పట్టించటానికి పార్టీలో ఉన్న
వాళ్ళు లాభం లేదని అనుకున్నట్లున్నారు చంద్రబాబునాయుడు. అందుకనే ట్రైనింగ్ ఇచ్చి
మరీ కొందరు పెయిడ్ ఆర్టిస్టులను ఎంగేజ్ చేసుకున్నారు.
సమస్య ఎక్కడ వచ్చిందంటే జగన్ పై విష ప్రచారం చేయటానికి టిడిపి ఎంతమందిని అద్దెకు తీసుకుందో తెలీదు కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్లే దొరికిపోతున్నారు. దాంతో కొద్దో గొప్పొ ఉందని అనుకుంటున్న టిడిపి పరువు కాస్త అమరావతి రోడ్ల మీద పడిపోతోంది. అయినా పార్టీ ముఖ్యులకు బుద్ధి వచ్చినట్లు లేదు లేండి. ఎందుకంటే వాళ్ళలో జగన్ పై కసి, ధ్వేషం అంతలా పేరుకుపోయింది మరి.
మొన్నటి ఎన్నికల్లో టిడిపి గూబ పగిలిపోవటంతో చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. వెంటనే జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రం చేసుకున్న దురదృష్టమంటూ గగ్గోలు మొదలుపెట్టేశారు. అధికారంలోకి వచ్చన దగ్గర నుండి ఇచ్చిన హామీలను నెరవేర్చేపనిలో జగన్ బిజీగా గడిపేస్తున్నారు. జగన్ దూకుడు చూసిన తర్వాత చంద్రబాబులో భవిష్యత్తుపై టెన్షన్ పెరిగిపోయింది. దాంతో ఎడా పెడా ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టేశారు.
అయితే జనాలు అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో తాను, లోకేష్ చేస్తున్న ఆరోపణలను జనాలు పట్టించుకోవటం లేదని గ్రహించిన తర్వాత పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపారు. వీళ్ళేమో ఎక్కడికక్కడ వైసిపి సోషల్ మీడియా నిపుణులకు దొరికిపోతున్నారు. ఫలితంగా ఫిర్యాదులు, పోలీసు కేసులు, అరెస్టులు తప్పటం లేదు.
ఇప్పటికి ఈ విధంగా నలుగురిని పోలీసులు అరెస్టు చేయటంతో టిడిపి పరువు పోయింది. ఇంకెతమంది జగన్ పై విష ప్రచారం చేయటానికి ప్రయత్నిస్తు దొరికిపోతారో తెలీదు. ఎందుకంటే తమలాంటి పెయిడ్ ఆర్టిస్టులు చాలామందినే టిడిపి రంగంలోకి దింపిందని వీళ్ళే చెబుతున్నారు. చూడబోతే జనాలు అసహ్యించుకునే రీతిలో పెయిడ్ ఆర్టిస్టులు వస్తూనే ఉంటారేమో ?