తెలుగు దేశం పార్టీలో మేధావిగా పేరున్న నాయకుల్లో యనమల రామకృష్ణుడు ఒకరు. బీసీ నాయకుడే అయినా పార్టీలో విషయం ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబుకు బాగా సన్నిహితుడన్న పేరుంది. అందుకే చంద్రబాబు మంత్రివర్గంలో ఆయనకు మంచి పోస్టే దక్కుతుంది. ఆర్థిక, శాశనసభ వ్యవహారాలు వంటి కీలక శాఖలు దక్కుతాయి. ఆయన మీడియా మందుకు వచ్చేది తక్కువ కానీ ప్రెస్ నోట్లతోనే ఎక్కువగా ఎల్లో మీడియాలో కనబడుతుంటారు.
టీడీపీ సమస్యల్లో ఉన్నప్పుడు విమర్శలు ఎక్కుపెడుతుంటారు. అయితే.. ఇప్పుడు అలాంటి మేథావి నోరు మూగబోయింది.. అది కూడా బొత్స సత్యనారాయణ వంటి మాస్ లీడర్ కారణంగా.. అవును.. మరి.. తాజాగా తెరపైకి వచ్చిన రాజధాని అమరావతి గెజిట్ అంశంపై ఆయన సరిగ్గా కౌంటర్ ఇవ్వలేక పోతున్నారు. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించినా.. రాజధాని అమరావతి అని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అంటే.. దీనికి అర్థం ఆంధ్రప్రదేశ్ కి ఇంకా రాజధాని లేదు అని... ఈ పాయింట్ తో కావాలి అంటే రాజధాని మార్చుకోవచ్చు. ఈ లా పాయింట్ ను మంత్రి బొత్స సత్యనారాయణ పట్టుకున్నారు.
అంతే.. రెండు, మూడు రోజులుగా ఈ ఇష్యూపై టీడీపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబు.. గజిట్, నోటిఫికేషన్ లేకుండా అమరావతి మీద బాబు అంతఖర్చు ఎలా చేయగలిగేడు ?న్యాయపరంగా చూస్తే చేసిన ఖర్చంతా తిరిగి రాబట్టవలసినదే ! అంటూ కొత్త వాదన వినిపిస్తున్నాడు. చంద్రబాబు.. తన హాయంలో కట్టినవన్నీ తాత్కాలిక భవనాలే తప్ప ఒక్కటీ శాశ్వత భవనం కాదు..
అంటే ఏ ఉద్దేశ్యంతో చంద్రబాబు ఇలాంటి పని చేశాడని బొత్స చంద్రబాబు ను కడిగి పారేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో పార్టీని ఆదుకునే యనమల వంటి నాయకులు కూడా ఏదో పైపైన కవర్ చేసుకుంటున్నారు కానీ.. బొత్సకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.