పాపం మొన్నటి ఎన్నికల్లో ఆయన తెలుగు దేశం పార్టీ నుంచి గెలిచారు. ఎమ్మెల్యే అయ్యారు.. అసలు రాష్ట్రంలో తెలుగుదేశమే లేదు అనే పరిస్థితి ఉన్నా.. ఆయన తెలుగుదేశం నుంచి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. అంతే కాదు.. తెలంగాణ రాష్ట్రంలో  ఎమ్మెల్యేలుగా గెలిచిన తెలుగుదేశం నేతలిద్దరిలో ఆయన ఒకరు. 
ఆయనే సండ్ర వెంకట వీరయ్య.. తెలుగుదేశం ఎమ్మెల్యే.. ఎన్నికల తర్వాత ఆయన కూడా టీఆర్ఎస్ లో చేరిపోదామనుకున్నారు. గత ఎన్నికలలో టిడిపి నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఒకరు సత్తుపల్లిలో గెలిచిన సండ్ర వెంకట వీరయ్య. ఇంకొకరు అశ్వారావుపేట నుంచి గెలిచిన మచ్చా నాగేశ్వరరావు. సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ లో చేరడానికి రెడీ అయ్యారు. 


సండ్ర వెంకట వీరయ్యకు మంత్రి పదవి కూడా ఖాయమని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఆయన కూడా వచ్చి టీఆర్ఎస్ అగ్రనేతలను కలిశారు కూడా. అంతా ఓకే అయ్యింది. అితే మరో టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరరావుతో తో కలిసి టిడిపిని  టిఆర్ఎస్ లో విలీనం చేయాలని ప్లాన్ చేశారు. అంతా ఓకే అయినా చివరి నిమిషంలో మచ్చా ప్లేటు ఫిరాయించేశారు. తాను టీడీపీలోనే ఉంటానన్నారు. 


మచ్చా తాను పార్టీ మారబోనని తేల్చి చెప్పడం సండ్రకు ఇబ్బందిగా  మారింది. పార్టీ విలీనానికి మూడింట రెండువంతుల బలం కావాలి. ఇద్దరే సబ్యులు ఉండడంతో ఒకరు మారితే ఏభై శాతమే మారినట్టు అవుతుంది. దాంతో సండ్ర టీఆర్ఎస్ చేరిక వాయిదా పడిందంటున్నారు. పార్టీలోని నేతలంతా మారినా సండ్ర ఇంకా పార్టీ మారలేకపోతున్నారు. దాంతో.. సండ్ర అటు టిఆర్ఎస్ లో చేరినట్లు కాక.. ఇటు టిడిపిలో ఉన్నట్లు కాక..  గాలిలో ఉన్నట్లు అయింది. అందుకే ఆయన కూడా  తాను గాలిలో ఉన్నానని వ్యంగ్యంగా చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: