ప్రధాని మోడీ తన పుట్టినరోజు వేడుకల్ని సొంత రాష్ట్రం గుజరాత్ లో జరుపుకున్నారు. సర్దార్ సరోవర్ డ్యామ్ సందర్శించిన మోడీ.. పటేల్ విగ్రహాన్ని విహంగ వీక్షణం చేశారు. నర్మదా మహోత్సవ్ ప్రారంభించి.. బటర్ ఫ్లై గార్డెన్ లో సీతాకోకచిలుకలు ఎగరవేశారు. తల్లి హీరాబెన్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు మోడీ. 


ప్రధాని నరేంద్రమోదీ తన జన్మదినాన్ని సొంత రాష్ట్రంలో జరుపుకున్నారు. గత ఏడాది ఆయన తన పార్లమెంట్ నియోజకవర్గం  వారణాసిలో స్కూలు విద్యార్ధుల సమక్షంలో గడిపారు. ఈ ఏడాది మాత్రం గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శిస్తూ గడిపారు. నర్మదా నది మధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అతి ఎత్తైన స్టాట్యూ ఆఫ్ యూనిటీ  దగ్గరకు చేరుకున్న మోడీ.. హెలికాప్టర్ నుంచి విహంగ వీక్షణం చేశారు.  


గుజరాత్ నర్మదా నదీ తీరంలో ఉన్న కేవడియా ప్రాంతంలో పటేల్ విగ్రహాన్ని దాదాపు 4 వేల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ  సందర్భంగా మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా అక్కడ పర్యటించారు. కేవడియా జంగిల్ సఫారీ ప్రాంతంలో కాక్టస్ గార్డెన్‌లో మోదీ  ప్రకృతి అందాలు ఆస్వాదించారు. బటర్ ఫ్లై గార్డెన్ లో సీతాకోక చిలుకలు ఎగరవేశారు. 


సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాంతాన్ని సందర్శించారు మోడీ. డ్యామ్‌పై పూజలు చేశారు.నర్మదా నదికి ప్రధాని హారతి ఇచ్చారు. నర్మదా  పరివాహక ప్రాంతంలో ఏక్తా నర్సరీని సందర్శించి..అక్కడ తయారు చేసే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల పనితీరును పరిశీలించారు. వాటి తయారు  గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నమామి దేవి నర్మదా  మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు మోడీ. గాంధీ నగర్ లో నివసిస్తున్న తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కలిసి భోజనం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: